వరలక్ష్మి శరత్ కుమార్ ..సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలుసు. కోలీవుడ్ హీరో శరత్ కుమార్ కూతురే ఈ వరలక్ష్మి శరత్ కుమార్ . కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది . ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా కన్నా కూడా విలన్ షేడ్స్ ఉన్న పాత్రలోనే ఎక్కువగా నటిస్తూ వచ్చింది. మేబీ తన బాడీ అందుకే సూట్ అవుతుంది అని రియలైజ్ అయిందేమో .
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నెగిటివ్ షేడ్స్ పాత్రలు పోషించి అభిమానులను ఆకట్టుకునింది . కాగా రీసెంట్గా వరలక్ష్మి శరత్ కుమార్ శబరి అనే సినిమాలో నటించింది . ఇది ఫుల్ టు ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ కధా నేపధ్యంతో తెరకెక్కింది. మదర్ సెంటిమెంట్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ రేంజ్ లో నటించేసింది అంటూ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో తాను వర్క్ చేసే ప్రతి డైరెక్టర్ తోను వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కండిషన్ పెడుతుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.
వరలక్ష్మి శరత్ కుమార్ తనకు కథ చెప్పేటప్పుడు ఏ విధంగా అయితే కథ ఉంటుందో తెరకెక్కించిన తర్వాత కూడా అదే విధంగా ఉండాలి అని ఎక్కడా కూడా ఎడిటింగ్ పేరుతో తన పాత్ర ప్రాధాన్యత తగ్గించకూడదు అని ముందుగా నే చెప్తుంది అని ..అలా చెప్పిన తర్వాతనే డైరెక్టర్ అగ్రిమెంట్ పై సైన్ చేస్తుంది అని ఓ న్యుస్ వైరల్ గా మారింది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ కమిట్మెంట్ గురించి తెలుసుకున్న అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ప్రతి ఒక్క నటికీ ఉండాల్సిన క్వాలిటీ అదే అంటున్నారు..!!