కెరియర్ లో ఫస్ట్ టైం ఆ హీరో కోసం అలాంటి పని చేసిన అనుష్క.. నిజంగా చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!

అనుష్క.. టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమంలోనే వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా మెరిసింది .

అనుష్క రెమ్యూనరేషన్ డిమాండ్ చేయరు. ఇచ్చినంత పుచ్చుకుంటుంది అన్న విషయం అందరికీ తెలుసు . కెరియర్ స్టార్టింగ్ లో అనుష్క ఎలా డైరెక్టర్స్ తో మింగిల్ అయ్యేదో ఇప్పటికీ ఆమె అలాగే మింగిల్ అవుతూ ఉంది. నిన్న కాక మొన్న వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలోనూ అదే పర్ఫామెన్స్ కనబరిచి అభిమానుల చేత శభాష్ అనిపించుకుంది. కాగా కెరియర్ లో అనుష్క ఒకే ఒక్క సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది .

అది కూడా మెగాస్టార్ చిరంజీవి కోసం . ఆయన స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తేనే ఈ న్యూస్ అప్పట్లో సెన్సేషన్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమాలో తప్పిస్తే ఇప్పటివరకు అనుష్క ఏ సినిమాలోనూ ఐటెం సాంగ్ చేయలేదు. చాలామంది ఆమెతో ఐటమ్ సాంగ్ చేయించుకోవడానికి హీరోలు బాగా ఇంట్రెస్ట్ చూపించారు . కానీ అనుష్క ఎవ్వరికీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు . కేవలం ఆ ఘనత అందుకున్న హీరో మన మెగాస్టారే కావడం గమనార్హం. నిజంగా అనుష్క చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే అంటున్నారు జనాలు అభిమానులు..!!