పెళ్లి కాకుండానే అత‌నితో అలా చేస్తున్నా.. అయితే తప్పేముంది.. సీరియల్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. ?!

బుల్లితెర నటి కీర్తి భ‌ట్‌.. కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులాటి దక్కించుకుని.. ఆ తర్వాత పలు సీరియల్స్ లో హీరోయిన్గా నటించి మెపెంచింది. అయితే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తనకు ఫ్యామిలీ లేదని చెప్పి అందరినీ కన్నీరు పెట్టించిన ఈ అమ్మడు.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రియుడు విజయ్ కార్తీక్ తో 2023 ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకుంది. ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గర నుంచి అత‌నితోనే కలిసి ఉంటూ పలు ఈవెంట్స్, యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్‌ చేస్తూ నెటింట‌ సందడి చేస్తుంది.

Keerthi Bhat : పిల్లలు పుట్టరని తెలిసినా ఒప్పుకున్నారు.. నటుడితో  నిశ్చితార్థం చేసుకున్న బిగ్‌బాస్ భామ.. ఎమోషనల్ అవుతూ.. | Biggboss fame  keerthi bhat engagement with ...

అలాగే ఇటీవల హైదరాబాద్ లో బాగా పాపులారిటి ద‌క్కించుకున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో ఫుడ్ అసలు బాగోలేదంటూ వీడియో చేసి పలు విమర్శలను ఎదుర్కొంది. ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేసింది. నిశ్చితార్థం తర్వాత ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. కొన్ని బాధ్యతలు, కమిట్మెంట్స్ కారణంగా పెళ్లికి కాస్త గ్యాప్ తీసుకుంటున్నాం. అయితే కొందరు ఎంగేజ్మెంట్ చేసుకునే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నేను ఓపెన్ గానే చెబుతున్నా.. మేము కలిసే ఉంటున్నాం. లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే అదేం తప్పు కాదు.

సమాజానికి నెగటివ్ మెసేజ్ ఏమీ ఇవ్వడం లేదు. అలా అని మేము కలిసి ఉంటే అక్కడ ఏదో జరిగిపోతుందని అర్థం కాదు కదా. తను వేరే ఇంట్లో ఉండి, నేను వేరే ఇంట్లో ఉంటే ఖర్చులు ఎక్కువ‌వుతాయి. ఇప్పుడు ఇద్దరం కలిసి ఉండటం వల్ల కొంత డబ్బు సేవ్ చేయగలుగుతున్నా. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నాం. ఇప్పుడు అతను నా జీవితంలోకి వచ్చాక ఒంటరితనం పోయింది. షూట్ నుండి ఇంటికి వచ్చాక నాకోసం ఎదురు చూసి డోర్ తీసే ఓ వ్యక్తి ఉన్నాడని భావిస్తున్నా. నేను ఇన్నాళ్లు కోల్పోయిన ప్రేమ అతను నాకు అందిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కీర్తి భ‌ట్ చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి.