సీఎంను పెళ్లి చేసుకుని రెండో భార్యగా వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?!

సినీ ఇండస్ట్రీలో ఒక‌రిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, సెట్ కాకపోతే వెంటనే విడాకులు తీసుకోవడం చాలా కామన్ గా జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఇలాంటి విడాకుల న్యూస్ తరచూ వింటూనే ఉన్నాం. అయితే చాలామంది ఈ తరం నటినట్టుల్లో లవ్ బ్రేకప్‌, మ్యారేజ్ బ్రేక‌ప్ అనేది సాధారణంగా మారిపోయింది. కానీ గతంలో కూడా ఇవన్నీ ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరిగాయట. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ సెలబ్రిటీగా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత.. కొంతమంది ప్రేమలో పడి వారి కెరీర్‌ను కూడా వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది.  అలా గతంలో ఓ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మడు.. తర్వాత ఓ రాజకీయ నాయకుడితో ప్రేమ‌లో ప‌డి అత‌ని పెళ్లి చేసుకుని.. రెండో భార్య గా మారి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందట.

Taraka Ratna: తారకరత్నతో 'భద్రాద్రి రాముడు' చిత్రంలో నటించిన ఈ హీరోయిన్  గుర్తుందా ?.. ఆమె ఓ మాజీ సీఎం భార్య.. - Telugu News | Do you remember  TarakaRatna's Super Hit Movie ...

ఇంతకీ ఆమె ఎవరో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ బ్యూటీ రాధిక కుమారస్వామి.. ఎన్నో సినిమాల్లో నటించి హిట్ అందుకుంది. అంతే కాదు కొన్ని సినిమాలను కూడా స్వయంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో షాకింగ్ డేసిషన్ తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. జెడిఎస్ నేత హెచ్డి కుమారస్వామి తో ప్రేమాయణం నడిపి.. 2010లో రహస్యంగా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ తో పాటు రాజకీయ రంగంలోనూ కలకలం రేగింది. వీరికి ఓ పాప కూడా ఉంది.

Radhika Says Marrying Kumaraswamy Was Her Fate | Radhika Kumaraswamy Is  Happy & Has No Regrets - Filmibeat

రాజకీయ నాయకుడు కుమారస్వామికి 47 ఏళ్ల వయసులో నటి రాధిక పై ప్రేమ చిగురించింది. వీరీమధ్య ప్రేమ.. చివరికి రహస్య పెళ్లి వరకు వెళ్ళింది. ఆ సమయంలో రాధిక కుమారస్వామి కంటే 27 సంవత్సరాలు చిన్నదని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి వారిద్దరికీ రెండో వివాహం కావడంతో అప్పట్లో ఇది సంచలనంగా మారింది. కోట్లధికారిగా ప్రస్తుతం ఈ బ్యూటీ లక్సరీ లైఫ్ ఆస్వాదిస్తుంది. అయితే రాధిక కుమారస్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈమె టాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తారకరత్న హీరోగా తెర‌కెక్కిన భద్రాద్రి రాముడు అలాగే అవతారం సినిమాలోని హీరోయిన్గా నటించి మెప్పించింది.