ధనుష్ కి భారీ షాక్ ఇచ్చిన ఐశ్వర్య-రజనీకాంత్.. ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో ఈ హీరో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే త్వరలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అదేవిధంగా ఆయన భార్య ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే వాళ్లకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ చేసిన పని అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది .

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రీసెంట్ గా ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది. రీసెంట్ గానే గృహప్రవేశ వేడుకను కూడా నిర్వహించారు . దీనికి సంబంధించిన ఫోటోలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . అయితే ఈ గృహప్రవేశ వేడుకల్లో ధనుష్ ఎక్కడ కూడా కనిపించలేదు. అంతేకాదు విడిపోయిన సరే మేము ఫ్రెండ్స్ గా ఉంటాము అంటూ విడాకులు అనౌన్స్మెంట్ ఇచ్చిన మూమెంట్లో చెప్పుకొచ్చారు ధనుష్ – ఐశ్వర్య .

అయితే ఐశ్వర్య కి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ఏ ఈవెంట్ లోను.. ధనుష్ పాల్గొనకపోతూ ఉండడంతో జనాలు ఓ రేంజ్ లో వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. పిల్లల కోసం స్కూల్ ఈవెంట్ లకి మాత్రమే కలిసి హాజరవుతున్నారు తప్పిస్తే ఎక్కడా కూడా మిగతా ఈవెంట్స్ లో కలిసి పార్టిసిపేట్ చేయట్లేదు అని ..ఫ్యాన్స్ ఇక వీళ్లు విడాకులు తీసుకోవడం పక్క అంటూ డిసైడ్ అయిపోయారు. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియా లో పెద్ద రాద్ధాంతంగా మారింది..!!