మూడుసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..? ఓపెన్ గా చెప్పేసిన తల్లి..!

మనకు తెలిసిందే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ వార్తలు నిజం – అబద్ధం తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోతుంది . స్టార్ సెలబ్రిటీస్ ఓకే ..ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీస్ గా ఉండి ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోలకి సంబంధించి దారుణాతి దారుణమైన రూమర్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అయిన వార్త తరుణ్ పెళ్లి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో తరుణ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు . అయితే ఆయన దూరంగా ఉన్న సోషల్ మీడియా ఆయనను వదలడం లేదు. హీరో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని రకరకాల వార్తలు పుట్టించారు. ఒకసారి ప్రొడ్యూసర్ కూతురితో.. మరొకసారి హీరోయిన్ తో.. మరొకసారి ఏకంగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికతో పెళ్లి అంటూ రకరకాల వార్తలు పుట్టించారు . ఆఖరికి తరుణ్ ఆ విషయాలపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది . నిహారికతో పెళ్లి అంటూ ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ తేల్చి చెప్పేశాడు .

అయితే ఆమె తరుణ్ తల్లి రోజా మాత్రం ఎప్పుడు ఆయన పెళ్లి గురించి స్పందించలేదు . తాజాగా నటి రోజా రమణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తరుణ్ పెళ్లి పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ” రూమర్స్ అనే పదంలోనే ఉంది కదా అవి నిజం కావని ..మరెందుకు వాటి గురించి పట్టించుకోవాలి. సీరియస్ గా అసలు తీసుకోము ..నవ్వుకొని సిల్లీగా లైట్గా వదిలేస్తాము ..మాట్లాడుకొనివ్వండి వాళ్ళ టైం పాస్ వాళ్లది ..తరుణ్ కి ఇప్పటికే మూడుసార్లు నా ప్రమేయం లేకుండానే పెళ్లి చేసేసారు .. ఇక ఎన్నిసార్లు చేస్తారో చేసుకొనివ్వండి.. ఎవరెవరితో ఫోటోలు పెట్టి నా కొడుకు పెళ్లి చేసేసారు ముఖాలు బ్లర్ చేస్తారు

చూస్తూనే ఉన్నా.. కొన్నిసార్లు ఆ ఫోటో తాలూకా హీరోయిన్లు ఫోన్ చేసి మరి…’ ఆంటీ ఈ ఫోటో చూశారా..?’ అంటూ నవ్వుతూ చెప్తూ ఉంటారు. నా కొడుకుతో చాలామంది హీరోయిన్లకు పెళ్లి చేశారు . సినిమా ఇండస్ట్రీలో అది కామన్ నేను పెద్దగా పట్టించుకోను ..వాడికి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేస్తాను ..అది లవ్ మ్యారేజ్ నా..? అరేంజ్డ్ మ్యారేజ్ నా..? అనేది వాడి చేతుల్లోనే ఉంది “అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో తరుణ్ పెళ్లి వార్త వైరల్ గా మారింది..!!