మరికొద్ది రోజుల్లో ఎలెక్షన్స్.. ఊహించని చిక్కుల్లో బండ్ల గణేష్..పోలీస్ కేసు నమోదు..ఎందుకంటే..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . అది ఏ రంగమైన సరే మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏపీ పాలిటిక్స్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తున్నాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ సెలబ్రిటీస్ ఏపీ రాజకీయాలలో వేలు పెడుతూ ఉండడం గమనార్హం . అయితే వేలుపెట్టిన పెట్టకపోయినా కొందరు జనాలు మాత్రం కొంతమంది టాలీవుడ్ స్టార్స్ ను రాజకీయాల్లో పరోక్షకంగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు బండ్ల గణేష్ .

సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో.. ఏపీ రాజకీయాలలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఎలా హై యాక్టివ్ లో ఉంటారో మనకు తెలిసిందే . కాగా రీసెంట్గా బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలినట్టు అయింది. ఆయనపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తన ఇంట్లో అద్దెకు ఉంటూనే 75 కోట్ల విలువైన ఇంటిని ఫోర్ జీరో డాక్యుమెంట్ చూపించి .. కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ హీరా గ్రూప్ సీఈవో నోహీరా.. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఆధారంగా తెలుస్తుంది . దీంతో బండ్ల గణేష్ క్యారెక్టర్ ఇలాంటి దా ..? అంటూ కొంతమంది మండిపడుతున్నారు.

అంతేకాకుండా తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది . ఇంటిని ఖాళీ చేయించమంటే తనని రౌడీలతో బెదిరిస్తున్నాడు అంటూ నౌహీరా ఆరోపించింది . దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ పేరు మారుమ్రోగిపోతుంది. అంతేకాదు గత కొద్ది కాలంగా అద్దె కూడా చెల్లించకుండా ఇంట్లోకి రానివ్వడం లేదు అంటూ రౌడీలను మా పైకి పంపిస్తున్నారు అంటూ మండిపడింది . రాజకీయ నాయకుల అండతోనే ఇలా చేస్తున్నాడు అని ఆవేదన వ్యక్తం చేసింది . ఈ విషయంపై ఎన్నిసార్లు పోలీసులకి చెప్పిన పెద్దగా పట్టించుకోవడంలేదట . అందుకే ఫిలింనగర్ డిజిపి కి ఫిర్యాదు చేసిందట . దీంతో బండ్ల గణేష్ పై ఐపీసీ 341 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!