పెళ్లికి ముందే మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ తో వరలక్ష్మికి షాక్ ఇచ్చిన నిక్..?!

స్టార్ న‌టుడు శరత్ కుమార్ నటవరసరాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. మొదట తమిళ్లో హీరోయిన్గా రాణించిన ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటిస్తూ మెప్పించింది. తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈమె ఒక సినిమాలో నటించింది అంటే కచ్చితంగా ఆ సినిమాలో కంటెంట్ బలంగా ఉంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఈ క్రమంలో వరలక్ష్మికి వరుస‌ సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఓ పక్కన సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతూనే మరోపక్క నికోలాయ్‌ అనే గ్యాలరిస్ట్ తో ప్రేమలో పడింది ఈ అమ్మడు.

இன்னும் கல்யாணமே நடக்கல.. அதுக்குள்ள இப்படியா?.. லவ்வருடன் வரலட்சுமி செய்ததை பாருங்க | Varalakshmi has gone on tour to Thailand with Nichlai - Tamil Filmibeat

నిన్న మొన్నటి వరకు పలు టాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొని.. పెళ్లిపై అసలు ఆసక్తి లేదంటే చెప్పిన ఈ అమ్మడు ఒక్కసారిగా నెకోలాయ్‌ను ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. అస్సలు ఎవరు గెస్ చేయని విధంగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫిక్స్ నెట్టింట‌ వైరల్ గా మారాయి. అయితే వీరిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో నికోలాయి.. వరలక్ష్మికి ఓ మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ తో షాక్ ఇచ్చాడని తెలుస్తుంది. వరలక్ష్మి కోసం ముంబైలో ఏకంగా రెండు విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేశాడట. రెండు బంగ్లాలలోనూ అన్ని సౌకర్యాలు ఉండేలాగా చూసుకున్నారని.. ఈ బంగ్లాల ఖరీదు కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తుంది.

16 Bangla house ideas | bungalow house design, kerala house design, house design

ఇక వరలక్ష్మి సినిమాల విషయాన్ని చూస్తే ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాగా శబరి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మహర్షి కూండ్ల సమర్పణలో.. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్లా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. పలువురు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ కాట్ట్ దర్శకుడుగా వ్యవహరించాడు. నేడు ఈ సినిమా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. థ్రిల్లర్ స్టోరీనీ ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అనే టాక్‌ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం పెళ్లి ఎప్పుడు అనే అంశంపై ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఎంగేజ్మెంట్ జరిగింది కదా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వివరించింది వరలక్ష్మి.