రూ.50 కోట్ల భారీ బడ్జెట్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సంయుక్త మీన‌న్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటించింది తక్కువ సినిమాలో అయినా స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు తన అందం, న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో గోల్డెన్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ స్వయంబులో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సంయుక్త మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

SWAYAMBHU New look teaser trailer | Nikhil | Samyuktha Menon | Swayambhu  teaser trailer (2023)

రూ.50 కోట్ల బ‌డ్జెట్‌లో తెర‌కెక్క‌నున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిందట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో.. ఒకసారి చూద్దాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు మూవీ తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే మరో రెండు సినిమాల్లో లైన్లో పెట్టాడు ఈ యంగ్ హీరో. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై లూధీర్ బైరెడ్డి దర్శకుడిగా మరో సినిమాను నటించనున్నాడు. 50 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందినట్లు సమాచారం. జూన్లో ఈ సినిమా సెట్స్‌ పైకి రానుందట. ఈ సినిమా కథపై ఏడాదిగా మేకర్స్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ కు మాస్ ఆడియన్స్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Bellamkonda Sreenivas: బెల్లంకొండ పదో సినిమా హీరోయిన్ ఎవరంటే! | Samyuktha  menon pairup with Bellamkonda Sreenivas avm

ఈ క్రమంలో ఆయన క‌థ‌కు 50 కోట్ల బడ్జెట్ అనేది రిస్క్ ఏమి కాదు. పైగా థియెట్రిక‌ల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు బెల్లంకొండ జోడిగా సంయుక్త మీన‌న్‌ హీరోయిన్గా సెలెక్ట్ అయిందని తెలుస్తుంది. సాధారణంగా సంయుక్త ఓ కథకు వెంటనే ఓకే చెప్పే రకం కాదు. మంచి కంటెంట్ ఉందనిపిస్తేనే సినిమా నటిస్తుంది. రెమ్య‌న‌రేషన్ ఎక్కువ ఇస్తున్నారు కదా అని సినిమాలు చేసే రకం కాదు. దీంతో సంయుక్త హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తుందని తెలియడంతో ప్రేక్షకులో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.