ఆ విష‌యంలో ప్ర‌భాస్‌తో పోటీ ప‌డుతున్న తార‌క్‌.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను సెట్స్ పై న‌టిస్తున్నాడు. అది కేవలం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైంది. అయితే ప్రభాసే కాదు తారక్ కూడా అది సాధించగలడు అంటూ నందమూరి ఫ్యాన్స్ వారిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్‌, కల్కి 2898 ఏడి సినిమా షూట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తారక్ కూడా దేవరతో పాటు వార్ 2సెట్స్ లోను పాల్గొంటున్నాడు. అయితే ఫ్యాన్స్ లెక్కలు ఎలా ఉన్నా ప్రశాంత్ నీల్‌ మాత్రం మొదట ప్రభాస్ పనులను పూర్తి చేసిన తర్వాతే.. తారక్ దగ్గరకు రావాలని ఫిక్స్ అయ్యారట. ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ పూర్తికాగానే.. సలార్ సీక్వెల్స్ శౌర్యంగా పర్వం షూటింగ్‌కు హాజరవుతారని తెలుస్తుంది.

It's so refreshing to see Prabhas experiment with different genres out of  all the tier 1 heroes 🔥 🔥. : r/tollywood

ఇక సలార్ శౌర్యంగా పర్వం ఫస్ట్ షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్స్ వేసినట్లు తెలుస్తోంది. 10 రోజులపాటు ఈ షూటింగ్ సాగుతుందని.. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ నటించనున్నార‌ట‌. అక్టోబర్ లోపు శౌర్యంగా పర్వాన్ని పూర్తి చేసి రిలీజ్ కు తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ రూపొందిస్తున్న సమయంలోనే సెకండ్ పార్ట్ కు ఎంతో కీలకమైన మేజర్ పోర్షన్ను షూట్ చేసేసారని సమాచారం. అందుకే ఇప్పుడు షూటింగ్ త్వరగా పూర్తి చేసి.. ఎట్టి పరిస్థితులను అక్టోబర్ నుంచి తారక్ పనులు మొదలుపెట్టేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రశాంత్‌. ఓ వైపు సలార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే.. మరో వైపు తారక్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేలా బాధ్యతలను తీసుకున్నారు అని తెలుస్తుంది.

ఇక ప్రశాంత్ నీల్‌తో మూవీ సెట్స్‌లో అడుగు పెట్టకముందే దేవరా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా పూర్తి చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ లో ఉన్నాడట. ఇక తారక్ హీరోగా నటిస్తున్న దేవర అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలో తారక్‌కు సంబంధించిన సినిమా షూట్‌ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉందని వినిపిస్తోంది. సో వార్ 2, దేవర షూట్ రెండింటికి ర్యాండంగా టైం కేటాయిస్తూ.. షూటింగ్ లు కంప్లీట్ చేస్తున్నాడు తారక్. తర్వాత పూర్తిగా ప్రశాంత్ నీల్ సినిమా కోసం టైం కేటాయించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఏడాదిలో మూడు సినిమాలను సెట్స్ పై ఉంచి.. మా హీరో దూసుకుపోతున్నాడు అంటే మా హీరో దూసుకుపోతున్నాడు అంటూ సంబరపడుతున్నారు ప్రభాస్, తారక్ ఫ్యాన్స్.