15 దేశాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప.. టీ గ్లాస్ స్టెప్పుల పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డులు సృష్టించాడు. అయితే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బ‌న్ని. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ను అమ్మవారి గెటప్ లో చూపించే సినిమాపై భారీ హైప్‌ పెంచాడు సుకుమార్. ఇక తాజాగా పుష్ప పుష్పా అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజై ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. ఏకంగా ఈ సాంగ్ 15 దేశాల్లో ట్రెండ్ అవుతూ సంచలనాలు సృష్టిస్తుంది.

 

పుష్ప ఫస్ట్ పార్ట్‌లో అల్లు అర్జున్ స్టెప్స్, మేనరిజం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఇటీవల రిలీజైన‌ ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్ షూ ఇప్పుతూ వేసిన స్టెప్పులు.. టీ ప‌డిపోకుండా టీ గ్లాస్ పట్టుకొని వేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ టీ స్టెప్ లో విషయంలో నెట్టింట పలు రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. చిన్న మామ పవన్ కళ్యాణ్ కు ఇన్ డైరెక్ట్ గా ప్రచారం చేస్తూ అలా.. గాజు గ్లాస్ స్టెప్స్‌తో బన్నీ అదరగొట్టాడని.. చివర్లో తగ్గేదెలా అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ అచ్చంగా పవన్ రాజకీయాల్లో తగ్గేదేలే అని సింబాలిక్‌గా చెప్పినట్లు ఉందంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

ఇక సినిమాలో యాంకర్ అనసూయ దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ లో విలన్ రోల్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ.. ఈ సినిమా సీక్వెన్స్ లో కూడా నటిస్తోంది. కాగా తాజాగా రిలీజైన‌ పుష్ప సాంగ్ పై, టీ స్టెప్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బన్నీ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఫ‌స్ట్‌సింగిల్‌ లోగోను తన స్టోరీలో షేర్ చేస్తూ.. నీ పేరే నీ బ్రాండ్ అంటూ కామెంట్ చేసింది. దీనితో పాటు టీ గ్లాస్ స్టెప్‌పై అనసూయ మరిన్ని ప్రశంసలు కురిపించింది. ఆ టీ గ్లాస్ స్టెప్ అయితే చాలా కష్టం.. అదరగొట్టారు అంటూ ప్రశంసించింది. ఈ సాంగ్ 24 గంటల్లో 40 మిలియన్ల వ్యూస్ రాబ‌ట్ట‌డంతో ఇండియా మొత్తంలో 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన లిరికల్ వీడియో గా రికార్డ్ సృష్టించింది.