వరలక్ష్మి శరత్ కుమార్ ‘ శబరి ‘ రివ్యూ.. మూవీ హిట్టా.. ఫట్టా.. ?!

శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో తాను ఎంచుకునే క్యారెక్టర్ తో నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తాజాగా శ‌బ‌రి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే తమిళ్లో పలు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ కాట్ట్ డైరెక్షన్ లో మహేంద్ర నాథ్ కుండ్లు ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. శబరి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఆడియన్స్‌ని మెప్పించిందా.. లేదా.. మూవీ హిట్టా.. పట్టా.. ఒకసారి చూద్దాం.

సంజన( వ‌ర‌లక్ష్మి) సింగిల్ మదర్ గా కూతురు రీయా(బేబి నివేక్ష‌)ను పెంచుతూ ఉంటుంది. తన భర్త అరవింద్(గ‌ణేష్ వెంక‌టరామ‌న్‌) కు ఆమె డివోర్స్ ఇచ్చేసి ముంబై నుంచి విశాఖ వచ్చేసింది. ఫ్రెండ్స్ వద్ద ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తుంది. తన కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేయించాలని ఆలోచిప్తుంది. జాబ్ కోసం ఎన్ని ప్లేస్లలో తిరిగిన వారందరూ ఆమెను రిజెక్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో కాలేజ్ నాటి ఫ్రెండ్ రాహుల్(శ‌శాంక్‌) ని కలిసిన సంజన అతను ఫేమస్ లాయర్ కావడంతో అతని సహాయంతో ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ కోసం అటెండ్ అవుతుంది. అయితే ఆమె క్వాలిఫికేషన్ కు జాబ్ దొరకదు. అక్కడే జుంబా డ్యాన్స్ ట్రైనింగ్ ఇచ్చే టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసి.. రిక్వెస్ట్ చేసి అందులో జాయిన్ అవుతుంది.

ఆ జాబ్ చేస్తూ సిటీకి దూరంగా ఉన్న ఓ అడవిలో సింగిల్ గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ క్రమంలో ఒక రోజు అరవింద్‌ ఉన్న అద్దె ఇంటికి వెళ్లిన‌ సంజన అక్కడ ఓనర్ ని కలుస్తుంది. తనకోసం సూర్య(మైమ‌ట్ గోపి) అనే క్రిమినల్ వచ్చాడని తాను ఎక్కడ ఉంటుందో చెప్పాలని.. మీ వద్ద త‌న‌ కూతురు ఉందని బెదిరించినట్లు వివరిస్తుంది. ఆ రోజు నుంచి ఆ క్రిమినల్ తనని వెంబడిస్తున్నట్లు ఆమెకు అనిపిస్తుంది. అతని నుంచి తప్పించుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంది. గాయాల పాలవుతుంది. అయితే పోలీస్ ఇనిస్టిగేషన్లో మాత్రం ఆ క్రిమినల్ చనిపోయినట్లు తెలుస్తుంది. మరోవైపు తన భర్త అరవింద్ కూతురు తనకే కావాలంటు కోర్ట్‌ను ఆశ్రయిస్తాడు.

కోర్టు సంజనకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అరవింద్ ఎలాగైనా తన కూతుర్ని తన దగ్గరకు తీసుకొచ్చుకోవాలనుకుంటాడు. దానికోసం అరవింద్ ఏం చేస్తాడు.. అరవింద సంజన డివర్స్‌కు కారణమేంటి.. సంజనాన్ని వెంబడిస్తున్న‌ క్రిమినల్ ఎవరు.. అతనికి వరలక్ష్మి కూతురు రియాకి ఉన్న సంబంధం ఏంటి.. కూతుర్ని కాపాడడానికి వ‌ర‌ల‌క్ష్మి ఏం చేసింది అన్నదే మిగతా కథ. వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుందంటే కచ్చితంగా అందులో కంటెంట్ ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. అలాంటిది ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుందంటే సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వారి అంచనాలకు తగ్గట్టు సినిమాలోను కంటెంట్ ఉంటుంది. కానీ దర్శకుడు దాన్ని డిలీట్ చేసినట్లు అనిపించింది.

Sabari (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అయితే మూవీస్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తీసుకెళ్లారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఆ థ్రిల్ ఎలిమెంట్లను బాగా ఎలివేట్ చేసి రెండు మూడు ట్విస్టులు ఇస్తూ సినిమా హైలైట్ అయ్యేలా చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ లో కథని ఎస్టాబ్లిష్ చేయడానికి పాత్రలు పరిచయనికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపించింది. వ‌ర‌ల‌క్ష్మి గ‌తంలో సీన్‌లు మాత్రం బోర్ కొట్టిస్తాయి. అలాగే తన పాపని దక్కించుకునేందుకు సంజనా పడే బాధ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. కోర్ట్ సీన్, హాస్పిటల్ సీన్ రొటీన్ గా టైంపాస్ చేసినట్లు అనిపిస్తాయి. సంజనాకి మళ్ళీ సూర్య పాత్ర కనిపించినట్లు వెంబడించినట్లు అనిపించ సీన్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆడియన్స్ థ్రిల్ అవుతారు. అయితే లాజిక్ పై దృష్టి పెట్టలేదు. కథ‌ వెనక్కి ముందుకి చూపిస్తూ కలలను మధ్యలో జోడిస్తూ సినిమాను కన్ఫ్యూషన్ గా తెర‌కెక్కించిన‌ట్లు అనిపించింది. దర్శకుడు ఆ క్లారిటీ మెయింటెన్ చేసి ఉంటే సినిమా అదిరిపోయేది. మొత్తానికి అయితే ఈ సినిమా క‌న‌ఫ్యూజ‌న్ క్రియేట్ చేసినా థ్రిల్లర్ ఇష్టపడే వారికి మాత్రం నచ్చే సినిమా అవుతుంది.