సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టివ్ గా ఉంటుంది అనేదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆమె పెట్టే పోస్టులు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో కూడా మనకు తెలిసిందే . అయితే అలాంటి డిఫరెంట్ పోస్ట్ లోను ఆమెను ట్రోల్లింగ్ చేయడానికి ఎప్పుడు కాచుకొని కూర్చుని ఉంటుంది ఒక పని పాట లేని బ్యాచ్ . అయితే తాజాగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ గా ఉండడంతో ఆమె పేరుని రచ్చ రంబోలాగా మార్చేశారు.
ప్రెసెంట్ ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . “ఎట్టి పరిస్థితుల్లోనూ వృషభ రాశి వారిని వదులుకోకండి” అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్క్రీన్ నోట్ షేర్ చేసింది.
దీనితో ఆమె పరోక్షంగా నాగచైతన్యకే కౌంటర్ వేసింది అంటున్నారు జనాలు. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు . ఇప్పుడు నాగచైతన్య – శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ టాలీవుడ్ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే సమంత వృషభ రాశి వారిని వదులుకోకండి అనే పోస్ట్ చేయడం సంచలనంగా మారింది . పరోక్షకంగా సమంత వాళ్ళ పెళ్లి న్యూస్ పై రియాక్ట్ అయింది అంటున్నారు జనాలు..!