నాన్న కోసం అలాంటి పని చేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న వీడియో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్.. రేర్ అటెన్షన్ ఉంటుంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఓ అరుదైన గౌరవం ఉంది . మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు. కాగా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్ అప్పట్లో పాట పాడిన ఒక న్యూస్ వైరల్ గా మారింది.

వాట్ మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్ పాట పాడడా..? ఎప్పుడు..? ఏ సినిమాలో..? ఎక్కడ ..?మేం వినలేదే..? ఇలాంటి డౌట్లు పెట్టుకోవద్దు.. ఇది చదవండి మీకే అర్థమవుతుంది . మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా రాజకీయాలలోనూ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అంటూ ఒక పార్టీని స్థాపించారు . ఆఫ్ కోర్స్ ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసారు . అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో పార్టీ ప్రమోషన్స్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ ప్రజారాజ్యం పార్టీ కోసం కొన్ని పాటలు సింగర్స్ చేత పాడించారు .

ప్రమోట్ చేశారు . అయితే వాటిల్లో రామ్ చరణ్ కూడా పాట పాడడం అప్పట్లో హైలైట్ గా మారింది . చిరంజీవి కి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడు రామ్ చరణ్. ప్రజారాజ్యం పార్టీలోనూ తన వంతు కృషి చేశారు . అప్పట్లో నాన్న పార్టీ కోసం రాంచరణ్ పాట పాడడం హైలైట్ గా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ ప్రచారం చేస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ హీరో ఏం చేస్తాడో..????