షారుఖ్, హృతిక్ రోషన్లతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ విజయ్ దేవరకొండ బ్యూటీని గుర్తుపట్టారా..?!

ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తమ బర్త్డే సెలబ్రేషన్స్.. లేదా ఇతర సందర్భాల్లో హీరో, హీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫోటోలు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు సెల‌బ్రెటీస్‌. ప్రస్తుతం సినీ రంగంలో స్టార్స్ గా కొనసాగుతున్న వారు చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు చాలామంది అభిమానులు ఆరాటపడతారు. అలా తాజాగా ఓ థ్రో బ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్లతో కొందరు స్టార్ కిడ్స్ మెరుస్తున్నారు.

Ananya Panday, Vijay Devarakonda promote Liger in Warangal

అయితే వీరంతా ఇప్పుడు పెద్దవారయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలు నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు. కాగా వీరిలో ఒకరు విజయ్ దేవరకొండ తో టాలీవుడ్ సినిమాలోను నటించారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సెలబ్రిటీ చుంకీ పాండే కూతురు అనన్య పాండే. ఈమె పాన్ ఇండియ‌న్ మూవీ లైగ‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. అలాగే మరో హీరోయిన్ షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌.

మొదటి నుంచి షారుక్ , చుంకీ పాండే మంచి స్నేహితులు. ఇక ప్రస్తుతం షారుఖ్ ఖాన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. చుంకీ పాండే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికి వీరిద్దరి మధ్యన స్నేహం అలానే ఉంది. అలాగే వీరిద్దరి పిల్లలు మధ్యన కూడా మంచి స్నేహం ఉంది. చుంకి పాండే కూతురు అనన్య పాండే, షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, కొడుకు ఆర్యన్ ఖాన్ మంచి స్నేహితులు కావడం విశేషం.