సెలవుల్లో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ చూస్తున్నారా..? ఇంట్లో ఇలా ఈ ఒక్క పని చేయండి..దెబ్బకి దారికి వస్తారు..!!

సమ్మర్ సెలవులు వచ్చేసేయ్ ..ఇన్నాళ్లు స్కూల్ కి వెళ్తూ బిజీబిజీగా గడిపేసిన పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఏం చేయాలో తోచక ..కుదిరితే మొబైల్ ఫోన్ లేదంటే టీవీలు ..ల్యాప్ టాప్ లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కేవలం మీ ఇంట్లో మా ఇంట్లో సమస్య కాదు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ సమస్య ఉంటుంది . ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు పిల్లలు ఏదో ఒకటి చూడాలి .. మొబైల్ ఇవ్వండి టీవీ పెట్టండి ..ట్యాబ్ ఇవ్వండి అంటూ గోల చేస్తూనే ఉంటారు.

అయితే అలా ప్రతిరోజు మనం అన్నన్ని గంటలు మొబైల్స్ ఇవ్వడం సేఫ్ కాదు . కళ్ళు దెబ్బతింటాయి అలాంటి వాళ్ళకి ఇదే సరైన చిట్కా . పెరిగిపోతున్న ఎండలకి పిల్లలను బయటకు తీసుకెళ్లాలి అన్న అంత మంచిది కాదు . అందుకే ఇంటిపట్టున తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి . మరీ ముఖ్యంగా తండ్రి ఉద్యోగం చేస్తున్నప్పుడు తల్లి ..తల్లి ఉద్యోగం చేస్తున్నప్పుడు తండ్రి కొంచెం సేపు పిల్లలకి ఏదైనా ఆక్టివిటీస్ చెప్పాలి.

బొమ్మలు వేయమని ..లేదంటే పజిల్ గేమ్స్ ఆడిపించేలా కొన్ని కొన్ని ఇండోర్ గేమ్స్ ను ప్లాన్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా కనీసం వారంలో ఒక్కసారైనా సరే పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వాళ్లకు కథలు చెబుతూ ఈరోజు నువ్వు ఏం చేసావు..? అనే విధంగా మాట్లాడుతూ పిల్లల్ని దగ్గర తీసుకుంటే .. వాళ్ళు మొబైల్ ఫోన్స్ కి ఎక్కువగా అలవాటు పడరు. మరీ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకు కొన్ని కొన్ని ఇండోర్ గేమ్స్ నేర్పించడం అదేవిధంగా వాళ్లలోని టాలెంట్ ని.. బయటపెట్టేలా కొన్ని కొన్ని డ్రాయింగ్స్ బొమ్మలు తయారు చేసే విధానాలను నేర్పించడం చాలా చాలా మంచిది .. అంతేకాదు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగేలా వాళ్ల గురించి కొన్ని వ్యాఖ్యాలు రాయమని చెప్పండి.. పిల్లలు మొబైల్స్ దూరం పెట్టడానికి ఇది ది బెస్ట్ టిప్..!!