ఆయన ఇచ్చిన లెటర్ ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పటికీ జాగ్రత్తగా ఉంచా.. డైరెక్టర్ చందు మండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న ఈయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ కు, సినిమాలు కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజమౌళి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కార్తికేయ సినిమా గురించి ఆయన ప్రస్తావిస్తూ నిఖిల్ తప్ప ఆ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరం కొత్త వాళ్ళమే.. దాంతో ఆ సినిమాకు పెద్దగా హడావిడి చేయ‌లేదు. కానీ టీజర్ ని విడుదల చేసిన తరువాత రాజమౌళి గారు ఆ టీజర్ లైక్ చేసి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

Rajamouli: ఇంత అభిమానమేంటయ్య.. రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన  డైరెక్టర్.. ఎందుకంటే.. - Telugu News | Director Chandoo Mondeti Says About  Rajamouli Letter For His Karthikeya ...

ఎవరో ఫోన్ చేసి చెబితే కానీ నాకు ఆ విషయం తెలియలేదు అంటూ వివరించాడు. ఆ తర్వాత నేను చూసా అయితే దాన్ని నేను సినిమా విజయం కంటే చాలా ఎక్కువ హ్యాపీగా ఫీలయ్యా.. రాజమౌళి మా సినిమా గురించి ఒక ట్వీట్ చేసినప్పుడు సినిమా రిలీజ్‌కి ముందు మంచి హైప్‌ వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ మెచ్చుకుంటూ సినిమా విడుదలకు ముందే ఆయన నాకు ఒక లెటర్ రాశారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నాకు టీజర్ చాలా బాగా నచ్చింది అంటూ ఆయన లేఖ రాశారని.. ఆ లేఖను ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నట్లు వివరించాడు చందు మొండేటి .

Karthikeya 3 : కార్తికేయ 3 అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి..  ఎప్పుడంటే..? | Nikhil karthikeya 3 movie update by director chandoo mondeti-10TV  Telugu

సినిమా రిలీజ్ కంటే ముందే రాజమౌళిని ఇంప్రెస్ చేయడం నాకు చాలా పెద్ద గౌరవంగా అనిపించిందని.. అది కూడా నా ఫస్ట్ సినిమాకి అంతకంటే పెద్ద సంతోషం లేదంటూ వివరించాడు చందు. రాజమౌళి ఏవైనా టీజర్లు, ట్రైలర్లు, సినిమాలను ఇష్టపడి ఎవరైనా బాగా చేసినప్పుడు.. వాటి గురించి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ఆ టీజర్, ట్రైలర్, లేదా గ్లింప్స్‌ను ట్విట్టర్ వేదికగా ఆడియోన్స్‌తో షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం చందు మొండేటి చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.