ఆ టాలీవుడ్ హీరోయిన్ పై పగ పెంచుకున్న చిరు డాటర్ సుస్మిత.. ఆమెను ఇండస్ట్రీలోనే లేకుండా చేసిందా ..?!

సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచి నటి, నటుల‌పై అనేక రకాలుగా రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అది చాలా కామన్. అయితే ఇటీవల కాలంలో ఇది మరింతగా ఎక్కువ అయింది. ఇక మెగా ఫ్యామిలీ గురించి అయితే రోజుకో వార్త నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మితకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్‌ టాపిక్ గా మారింది. చిరు పెద్ద కూతురు సుస్మిత ఓ హీరోయిన్ పై కోపంతో ఆమెను ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూసిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అసలు మేటర్ ఏంటంటే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్టైలిష్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Khaidi No 150 Movie Songs | Rattalu Rattalu | Chiranjeevi | Kajal | TFPC

అయితే మెగాస్టార్ 150వ‌ సినిమాకు ఈమె స్టైలిష్ గా వ్యవహరించింది. ఈ సినిమా షూట్ టైంలో ఓ హీరోయిన్ కు సుస్మిత కి మధ్య పెద్ద గొడవ జరిగిందని రూమర్ అప్పట్లో తెగ వైరలైంది. దీంతో సుస్మిత ఆమెకు అసలు టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు రాకుండా చేయాలని ఫిక్స్ అయిందట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. స్టార్ బ్యూటీ కేథరిన్ థెరిస్సా. మొదట ఈమెను చిరు150 లో ఐటెం సాంగ్ రత్తాలు.. రత్తాలు.. పాటుకు తీసుకోవాలని భావించారట మేకర్స్. అయితే షూటింగ్ జరిగే టైంలో సుస్మిత కేథరిన్‌ల‌కు మధ్య గొడవ జరగడం కేథరిన్ ఐటెం సాంగ్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు కామెంట్లు వినిపించాయి.

A For Apple Full Audio Song | Jaya Janaki Nayaka | Bellamkonda Srinivas |  Rakul Preet | DSP

ఆ తర్వాత లక్ష్మీరాయ్ ని ఐటమ్ సాంగ్ లో తీసుకున్నారు. ఈ సాంగ్ కి ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత నుంచి కూడా కేథరిన్‌కు ఒక అవకాశం కూడా రాకుండా చేసిందట సుస్మిత. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ జయ జానకి నాయక మూవీ లో ఐటెం సాంగ్ లో మెప్పించింది. దీంతో కేథ‌రిన్, సుస్మిత మధ్య గొడవ అంటూ వచ్చిన వార్తలన్నీ రూమర్స్ అని తేలిపోయింది. కానీ ఇప్పటికీ ఇదే వార్తను వైరల్ అవుతుంది.