16 ఏళ్ల వయసులో అమ్మ ఎదురుగానే కమిట్మెంట్ అడిగారు.. తెలుగు హీరో భార్య షాకింగ్ కామెంట్స్..?!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్‌, సెలబ్రిటీస్ తమ సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా.. లేదంటే ఇంటర్వ్యూలో ఆడియన్స్ తో షేర్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య తన సినీ కెరీర్‌లో జరిగిన క్యాస్టింగ్ అనుభ‌వాని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. మొదట చక్రవాకం సీరియల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ప్రేమించే రోజుల్లో, సందడి, ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరి ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మ‌డు.. నటన పరంగా ప్రశంసలు అందినా ఊహించిన రేంజ్ లో పాపులారిటీ అయితే రాలేదు.

BB Telugu 3 fame Varun Sandesh wishes wife Vithika Sheru on 4th wedding  anniversary with a cute post - Times of India

ఈ క్రమంలో వరుణ్ సందేశ్‌తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. అతని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. అయితే కొంతకాలానికి తిరిగి ఇండియాకు వచ్చేసిన ఈ జంట బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ షో తర్వాత వితికాకు మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు ఫోటోషూట్లతో, వీడియోలుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వితికా షేరు మాట్లాడుతూ తనకు పదహారేళ్ళ వయసులోనే క్యాస్టింగ్ కౌచ్‌ ఎదురు అయినట్లు వివరించింది. చిన్నప్పటి నుంచి తను ఎన్నో కష్టాలు పడ్డానని.. అమ్మ న‌న్ను, నా చెల్లిని కష్టపడి పెంచిందని.. అదే టైంలో మా ఇంటి అవసరాల కోసం నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టాను అంటూ వివరించింది.

Vithika Sheru (@vithikasheru) • Instagram photos and videos

ప్రతి ఆడిషన్‌కు తన వెంట త‌న అమ్మను తోడుగా తీసుకు వెళ్ళదని.. ఈ క్రమంలో తన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ ఆఫర్ వచ్చిందంటూ వివరించింది. ఓ సినిమా కోసం తనను సెలెక్ట్ చేశారని.. అయితే మా అమ్మతో మాట్లాడాలని నన్ను బయటకు పంపించి… మీ అమ్మాయికి సినిమాలో ఛాన్స్ కావాలంటే నిర్మాతల సైడ్ నుంచి కమిట్మెంట్ విషయంలో చాలా ఒత్తిడి ఉంటుందంటూ వివరించారని.. ఆ మాట మా అమ్మకు అర్థం కాక నన్ను లోపలికి పిలిచి కమిట్మెంట్ అంటే ఏమిటి అని అడిగిందని.. నేను వెంటనే ఆఫర్‌కు నో చెప్పి అమ్మని తీసుకుని అక్కడ నుంచి వచ్చేసాను అంటూ వివరించింది. ప్రస్తుతం వితికా మాటలు నెటింట వైరల్‌గా మారడంతో అంతా షాక్ అవుతున్నారు.