డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ పిచ్చి ఏంటి.. ప్రభాస్ పై ఇష్టంతో ఈ అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ బాగా హద్దులు మీరిపోతున్నారు . ఎలా అంటే తమ ఫేవరెట్ హీరో కోసం చాలా చాలా రిస్క్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా భారీ భారీ టాటూలను ఒంటిపై కూడా వేయించేసుకుంటున్నారు . చిన్న టాటూను ఒంటి పై వేయించుకోవాలి అంటేనే దేవుడు కనపడతాడు .. మరి అలాంటిది ప్రభాస్ అంటే ఇష్టంతో ఇక్కడ ఒక బ్యూటీ ఏకంగా టాప్ తీసేసి వీపు పై ఆయన ఫోటోను టాటూ గా వేయించుకునింది . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే .. మరీ ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూసింత ఎక్కువనే చెప్పాలి . సోషల్ మీడియాలో రీసెంట్ గా ఓ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది. ఆ ఫోటోలో ఒక అమ్మాయి టాప్ తీసేసి వీపుపై రెబెల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలి పిక్చర్ ని టాటూ గా వేయించుకుంది .

దీనికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది ఈ అమ్మాయి అభిమానాన్ని మెచ్చుకుంటుంటే .. మరి కొంతమంది మాత్రం పిచ్చి పైత్యం అంటూ ట్రోల్ చేస్తున్నారు. కేవలం ఈ బ్యూటీనే కాదు .. గతంలో చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా ప్రభాస్ పై ఉన్న ప్రేమతో అభిమానంతో ఒంటిపై రకరకాల టాటూస్ వేయించుకున్నారు..!!