ఆ స్టార్ హీరోయిన్ కు కొత్త లైఫ్ ఇవ్వనున్న సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు క్యూబ్ లో ఛాన్స్..?!

టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన సిద్దు జొన్నలగడ్డ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన కథలో వేసుకోవడంతో పాటు.. భారీ కలెక్షన్లు దక్కించుకున్నాడు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుని సిద్దు జొన్నలగడ్డ మార్కెట్ మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమాల్లో హోమ్లీ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న అనుపమా.. బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందడంతో వీటికి సీక్వెల్ గా టిల్లు క్యూబ్ ఉండబోతుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.

Stage set for Tillu Cube | cinejosh.com

అయితే ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన నటించే ఛాన్స్ ఓ స్టార్ హీరోయిన్ కు వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజ హెగ్డే కెరీర్ మొదట్లో అగ్ర హీరోల అందరి సరసన నటించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. అతిత‌క్కువ టైంలోనే లక్కీ బ్యూటీగా మారిన ఈ అమ్మ‌డు.. గోడకు కొట్టిన బంతిలా మళ్లీ వెనక్కి వచ్చింది. ఎంత త్వరగా సక్సెస్‌లు అందుకుందో.. అదే స్పీడ్ తో వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొని ఐరన్ లెగ్‌గా మారిపోయింది. అయితే తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా బుట్ట బొమ్మకు వర్కౌట్ కాలేదు.

Pooja Hegde - Wikipedia

నిన్న మొన్నటి వరకు ఎటువంటి సినిమాల్లో నటించకుండా ఏడాది పాటు ఖాళీగా ఉన్న బుట్ట బొమ్మ.. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్ లోకి వస్తుంది. అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే నాని హీరోగా ఓజి ఫేమ్‌ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుందట. దీంతో పూజ హెగ్డే పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెర‌కెక్క‌నున్న టిల్లు క్యూబ్ సినిమాలో అవకాశం వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టిలు స్క్వేర్ సినిమాలో కచ్చితంగా అనుపమ నటిస్తే ఈమె ద‌శ తిరగడం ఖాయం అంటూ.. మరోసారి పూజా ఫామ్ లోకి వచ్చి స్టార్ హీరోయిన్గా మారిపోతుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ న్యూస్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.