రాత్రిపూట కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా.. అయితే మీకు ఈ లోపం ఉన్నట్లే..?!

కాళ్ళు, చేతులు తిమ్మిర్లు సాధారణంగా అందరిలోనూ కనిపించే సమస్య. కాసేపు అటు, ఇటు తిరిగితే సెట్ అవుతుందని అంత భావిస్తారు. ఒకటి, రెండు నిమిషాల్లో కోలుకుంటారు. అయితే కండరాల్లో రక్తప్రసరణ జరగకపోతే అలా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కానీ ఇది ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. దాదాపు ప్రతి పదిమందిలో ఏడు మందికి ఇలా జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది నిద్రిస్తున్న సమయంలో, మరి కొంతమంది కూర్చున్న సమయంలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.

అసలు ఇది ఎందుకు వస్తుంది.. ఈ సమస్యకు చెక్ పెట్టడం ఎలాగో ఒకసారి చూద్దాం. నిద్రలో కాళ్లు , చేతులు తిమ్మిర్లు రావడానికి అసలు కారణం విటమిన్ బి12 లోపమని తెలుస్తుంది. దీని తీవ్రత క్రమంగా పెరిగి కాళ్ల నెప్పులకు దారితీస్తుంది. విటమిన్ బి12 లోపంతో చాలామంది ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా.. మన శరీరంలో సాధారణంగా వృద్ధి చెంది ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అయితే దీనిలోపం తలెత్తినప్పుడు మోకాళ్ళ నొప్పుల సమస్యలు వస్తాయి. ఈ లోపానికి ఎలాంటి మందులు, ఇంజక్షన్లు అవసరం లేకుండానే మనం చెక్ పెట్టవచ్చు. యువకులు రోజుకు రెండు పాయింట్ నాలుగు మైక్రోగ్రామ్ లో విటమిన్ బి12 తీసుకోవాలి.

Hand Pain Treatment Chennai | Best Hand Surgeon Tamil Nadu,India

లేదంటే శరీరానికి క్రమంగా బలహీనత ఏర్పడుతుంది. దీంతో రుచి, వాసన కోల్పోవడం.. జ్ఞాపకశక్తి కోల్పోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక బి12 సహజంగా ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మాంసాహారం తీసుకోవడం వల్ల విటమిన్ పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా మేక, గొర్రెలో అధిక శాతం బి12 ఉంటుంది. సి ఫుడ్, చేపల, ఎగ్స్‌తో బీ12 సమృద్ధిగా లభిస్తుంది. ఇక శాఖాహారులు అయితే ఆకుకూరలు, పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల ఈ లోపానికి చెక్ పెట్టవచ్చు. పాలు, పెరుగు, జున్ను లేదా పులిసిన మజ్జిగలో బి12 సమృద్ధి గా లభిస్తుంది. పిస్తా, బాదంలా డ్రై ఫ్రూట్స్ లో కూడా ఇది ఉంటుంది. అంతేకాదు మంచినీటిలో కూడా బీ12 సమృద్ధిగా లభిస్తుంది. అందుకే శరీరానికి సరిపడా నీటిని త్రాగుతూ ఉండాలని నిపుణులు చెబుతారు.