ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఇంత ప్రమాదమా.. తెలిస్తే తప్పక అలవాటు మార్చుకుంటారు..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలామంది ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని ఏదైనా తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా కొందరు టీ, కాఫీలతో రోజుల ప్రారంభిస్తే.. మరికొందరు హెల్త్ కాన్షియస్‌తో ఫ్రూట్ జ్యూస్ ని తీసుకుంటూ ఉంటారు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ రుచికరంగా ఉండటమే కాదు.. పోషకాలతో నిండి ఉంటుందని డే హెల్తీగా స్టార్ట్ చేయడానికి సహకరిస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే కాళీ పొట‌తో ఫ్రూట్ జ్యూసులు తాగడం అనేది చాలా హానికరమైన అలవాటని నిపుణులు చెప్తున్నారు. ఖాళీ కడుపుతో పండరసాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతుందట. సాధారణంగా పండ్లలో ఫైబర్ శరీరానికి ఎక్కువగా లభిస్తుంది.

Healthy Juice Ideas: 10 juices you can make at home with limited ingredients

ఇది చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేసి.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడానికి సహకరిస్తుంది. అయితే పండరసాలలో ఫైబర్ ఉండదు. దీంతో కాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూసులు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అలాగే కాళీ క‌డుపుతో ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం వల్ల శరీరంలో ప్రక్టోజ్‌ మోతాదు పెరిగి.. కాలేయం ప్యాంక్రియాస్ పై ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. దీంతో కాళీయే పనితీరు నెమ్మదిస్తుంది. అలాగే ఉదయాన్నే తీసుకునే నారింజ, టెనాగ్రీన్, ద్రాక్షా లాంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం ఇంకా ప్రమాదకరమైన నిపుణులు చెప్తున్నారు.

Bottled citrus juice with fresh citrus slices on white background.... |  Citrus juice, Fruit splash, Fruit photography

కడుపులో చికాకును గ్యాస్ ప్రాబ్లమ్స్ కలిగిస్తాయి. పొట్టలో పుండ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ పొట్టతో ఫ్రూట్ జ్యూస్ లు తాగడం అస్సలు సుర‌క్షితం కాదని తీవ్ర అలసట, అధిక దాహం, విపరీతంగా ఆకలి వేయడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు. కనుక ఉదయాన్నే లేచిన వెంటనే ఫ్రూట్ జ్యూసులు తాగే అలవాటు ఉంటే కచ్చితంగా దాన్ని మానుకోవడం బెటర్. జ్యూస్ లు బదులు ఫ్రూట్స్ నేరుగా తినవచ్చు.