హాట్ ఫోజులతో కుర్రాళ్ళ మతి పొగుడుతున్న శ్రీముఖి….ఫోటోలు వైరల్.

ఈ మధ్య కలంలో స్టార్ మాలో నీతోనే డాన్స్ అనే సెలబ్రిటీ డాన్స్ కాంటెస్ట్ ప్రారంభమైంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్గా వ్యవహరిస్తున్న విషయం అందరకి తెలిసినదే. ఐతే ఇప్పుడు శ్రీముఖి ఈ డాన్స్ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రతిరోజూ కొత్త కొత్త అవుట్ ఫిట్స్ తో తన ఫాషన్ సెన్స్ చూపిస్తూ, తన అందచందాలతో, ఎనర్జీతో ఈ డాన్స్ షోలో జోషును నింపుతున్నారు.

శ్రీముఖి నీతోనే డాన్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో షార్ట్ ఫ్రొక్ ధరించింది. ఆ హాట్ లుక్ తో ఒక ఫోటో షూట్ కూడా చేసింది. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. గోర్జియస్ అని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు హార్ట్ సింబల్స్ తో శ్రీముఖిపై తమ ప్రేమని అభిమానాన్ని చూపుతున్నారు. ఇప్ప్డుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శ్రీముఖి పరిశ్రమలో అడుగుపెట్టింది నటి కావాలనే ఆశతో. కానీ ఆమెను ఆ అదృష్టం వరించలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు బుల్లితెర మీద అడుగుపెట్టింది. శ్రీముఖి దశ మార్చిన షో పటాస్. యాంకర్ రవితో పాటు ఆమె కెమిస్ట్రీ జనాల మనసులలో నిలిచిపోయింది. తరువాత ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయి. మెల్లమెల్లగా బుల్లితెరకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయారు శ్రీముఖి. ఆమె పాపులారిటీ పెరగడంలో బిగ్ బాస్ షో పాత్ర కూడా ఉందండోయ్. శ్రీముఖి బిగ్ బాస్ షో ఫైనల్ వరకు వెళ్లి త్రుటిలో టైటిల్ కోల్పోయి రన్నర్ అప్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఐదు ఆరు షోలకు యాంకర్గా వ్యవహరిస్తున్నారు. సంపద కూడా భారీగానే ఉందని సమాచారం. ఆమె ఈమధ్యే హైద్రాబాద్లో కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నారు. శ్రీముఖి ఇప్పుడు ఒకవైపు బుల్లి తెర మీద సత్తా చాటుతూనే వెండితెర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ మధ్యే “క్రేజీ అంకుల్స్” అనే రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్గా నటిస్తోందనే వార్త కూడా వినిపిస్తోంది.