మళ్లీ అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకున్న సమంత.. ఫ్రూప్ ఇదే..!!

సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పవచ్చు. వారు ఏవైనా పోస్టులు ఫోటోలు సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారంటే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. అలా పలు రకాల బ్రాండ్లను సైతం ప్రమోషన్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. గతంలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు.కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అత్యధికంగా ఫాలోయింగ్ కలిగిన ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.

Ormax Most popular Actress June 2023 Samantha alia bhatt deepika padukone  Nayanthara Kajal Trisha katrina kiara keerthy suresh rashmika - ये हैं जून  की टॉप 10 पॉपुलर एक्ट्रेसेस, दूसरे-तीसरे पर हैं आलिया ...

అలాంటి వారిలో సమంత కూడా ఒకరు. ఈమె ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పవచ్చు. సమంత ఇంస్టాగ్రామ్ లో 28 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నది. ఈ కారణంగానే ఈమె ఎలాంటి పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.. ఫోర్ మ్యాక్స్ ఇండియా ప్రతినెల మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల జాబితాలను రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది.. అలాగే జూన్ నెలలో సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ యాక్టర్ గా సమంత నిలవడం గమనార్హం.

టాప్ టెన్ హీరోయిన్స్ లో మొదటి స్థానంలో సమంత ఉండగా రెండో స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, మూడవ స్థానంలో దీపికా పదుకొనే, నాలుగవ స్థానంలో నయనతార ఐదవ స్థానంలో కాజల్ అగర్వాల్ ఉన్నది. అయితే ఈసారి ఈ జాబితాలో నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక పదవ స్థానంలో ఉన్నది ఆమె కంటే ముందు తొమ్మిదవ స్థానంలో కీర్తి సురేష్ ఉండగా ఎనిమిదవ స్థానంలో కియారా అద్వానీ ఏడవ స్థానంలో కత్రినా కైఫ్ ఆరవ స్థానంలో త్రిష నిలవడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది.