ఏ అమ్మాయితో అయినా 37 రోజులే అంటున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. మెగా హీరో ఇంత ముదురా..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం `బ్రో` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ కు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించాడు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోద‌య సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో మూవీ జూలై 28న‌ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే తాజాగా బ్రో టీమ్ ను యాంక‌ర్ సుమ ఇంట‌ర్వ్యూలో చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌ని, సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రియు హీరోయిన్ కేతిక శ‌ర్మ పాల్గొన్నారు. సినిమాకు సంబంధించి ఈ ముగ్గురు ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. యాంక‌ర్ సుమ కొన్ని ఫ‌న్నీ ప్ర‌శ్న‌లు కూడా వేసింది.

ఈ క్ర‌మంలోనే `ఒక అమ్మాయితో బ్రేక్ అయిన త‌ర్వాత ఆమెను ఆ అబ్బాయి ఎంత‌కాలంలో మ‌ర్చిపోగ‌ల‌డు..?` అని సుమ ప్ర‌శ్నించింది. అందుకు తేజ్ ఇచ్చిన స‌మాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుమ ప్ర‌శ్న‌కు తేజ్ బ‌దులిస్తూ.. `నా లైఫ్ లో చాలా బ్రేకప్స్ జ‌రిగాయి. అయితే బ్రేక‌ప్ త‌ర్వాత‌ ఏ అమ్మాయిని అయినా నేను 37 రోజుల్లోనే మ‌ర్చిపోతాను` అని పేర్కొన్నాడు. తేజ్ ఆన్స‌ర్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తురు. కొంద‌రు ఎన్ని బ్రేక‌ప్స్ జ‌రిగాయి చెప్పు బాసు అంటుంటే.. మ‌రికొంద‌రు మెగా హీరో ఇంత ముదురా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.