స్విస్‌ ఛాలెంజ్‌: కేంద్రానికి ఇష్టంలేదా? 

అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్‌ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్‌. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]

కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!

ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే […]

నీటి యుద్దాలు — కేంద్రం దొంగాట

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]

స్వామి ‘రామాయణం’లో నిజమెంత?

సుబ్రహ్మణ్యస్వామి అంటే దేశ రాజకీయాల్లో సంచలనం. బిజెపి నాయకుడిగా, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయన ఎందరో రాజకీయ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించిన ఘనుడు. జయలలితను జైలుకు పంపడమే కాకుండా, సోనియాగాంధీతోపాటు ఆమె తనయుడు రాహుల్‌గాంధీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టాడీయన. ఆర్‌బిఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ రెండోసారి ఆ బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుపుల్ల వేసింది కూడా ఈ స్వామే. ఈయనగారికి రామయణం గురించి వివాదం సృష్టించాలనిపించినట్లుంది. రామాయణంలో రాముడు, రావణుడి కాళ్ళు నరికేశాడు, మళ్ళీ వాటిని రప్పించాడు. ఎందుకు? అంటూ […]

చంద్రులను టెన్షన్ పెడుతున్న జంప్ జిలానీలు

పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు […]

KTR ని ఎత్తి ఇరుక్కుపోయిన పారికర్

బీజేపీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించడంపై తెలంగాణ బీజేపీ నేతల్లోనే చర్చనీయాంశమయిందని అంటున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం సాధారణమే. అలాగే, ఆ తర్వాత పార్టీ సమావేశాల్లో.. ప్రత్యర్థి ప్రభుత్వం పైన విమర్శలు కూడా సహజమే. మనోహర్ పారికర్ కూడా అధికారిక సమావేశంలో […]

వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!

నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]

టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజాగా మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ తీవ్రస్థాయి నిర్ణయాలకు రెడీ అవుతున్నారు. ఈ […]

రాజకీయ నాయకులూ ప్రేమలో పడతారు..

ప్రేమకు హోదా..దర్పం ఇంకా..ఏమైనా ఉంటాయా ? ఉండవు..తొలి చూపులోనే ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇలాగే మోడీ కేబినెట్ లోని మంత్రి ప్రేమలో పడిపోయారు. ఎయిర్ హోస్టెస్ రచన శర్మ చూపుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో పడిపోయారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆగస్టు 9వ తేదీన వీరి వివాహం జరగబోతోందని తెలుస్తోంది. అసలు వీరి ప్రేమ ఎలా చిగురించింది అనే దానిపై మంత్రి సుప్రీయో వివరణనిచ్చారు. […]