మెగా లేడీ ఫ్యాన్ కి షాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. దెబ్బకు ఆల్ సెట్..!

ఈ మధ్యకాలంలో ఇది మనం బాగా గమనిస్తున్నాం ..స్టార్ సెలబ్రిటీస్ ఎలా అయినా తమతో మాట్లాడాలి అంటూ కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఫలానా స్టార్ హీరో లేదా.. పలానా హీరోయిన్ అలా చేస్తే ఈ పని చేస్తాం ..ఇలా చేస్తే ఆ పని చేస్తామంటూ ట్వీట్స్ ..ఇన్స్టా లో మెసేజెస్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ సిచువేషన్ ఫేస్ చేశాడు సాయిధరమ్ తేజ్ .

మెగా అభిమాని అయిన ఒక అమ్మాయి తన పుట్టినరోజు కావడంతో సాయిధరమ్ తేజ్ కు ట్యాగ్ చేసింది . “సాయిధరమ్ తేజ్ తనకు బర్త్డ డే విషెస్ చెప్తే .. అది తనకు చాలా చాలా విలువైనది అని ..గొప్పది అని అదే నాకు ప్రపంచం తో సమానం అంటూ అతను నన్ను విష్ చేస్తాడు అని ఆశిస్తున్నాను” అంటూ రాసుకువచ్చింది. ఈ ట్వీట్ అటూ ఇటూ చేరి మెగా హీరో సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్ళింది . దీనితో వెంటనే సెకండ్ కూడా ఆలోచించండి సాయిధరమ్ తేజ్ స్పందించాడు .

అంతేకాదు ఆమెకు రిప్లై ఇస్తూ..” పుట్టినరోజు శుభాకాంక్షలు బాగా చదువుకొని మీ తల్లితండ్రులను గర్వపడేలా చేయి” అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్..సాయి ధరమ్ తేజ్ పెట్టిన రిప్లై వైరల్ గా మారింది. అంతేకాదు దీనిపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు జనాలు . ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ ఒకరు అంటుంటే ..ఈ మధ్యకాలంలో ఇలా ఎక్కువైపోతున్నాయి అని ..స్టార్ హీరోలు ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అని మరికొందరు చెబుతున్నారు . మొత్తానికి అనుకున్నది సాధించింది ఈ మెగా లేడీ ఫ్యాన్ ..!!