తెలుగు స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతుంది. అలాగే ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న నయన్ కూడా బాలీవుడ్ జవాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారి తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఇద్దరు కథనాయక లో ఇటీవల మార్పు బాగా కనిపిస్తుంది. ఫిజికల్ మేకవర్ మాత్రమే కాదు.. వీరిద్దరి బిహేవియర్ లో కూడా స్టార్స్ గా మారిన తర్వాత చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు నెటిజన్స్. రష్మిక శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్‌కు ఎదిగిన క్రమంలో ఎటువంటి మార్పు వచ్చిందో కానీ.. సౌత్ టూ నార్త్ ట్రావెల్ లో మాత్రం ఈ అమ్మడు లో భారీ చేంజెస్ ఏర్పడ్డాయి.
గతంలో రష్మిక ఏ ఈవెంట్లకు వెళ్ళినా, పార్టీలకు వెళ్లిన మీడియాలకు ఫోజులు ఇచ్చేటప్పుడు వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లో మెరిసేది. అయితే ఆ కాస్ట్యూమ్ క్యారీ చేయడానికి ఆమె ఎన్నో ఇబ్బందులను పడటం కూడా గమనించొచ్చు. ఇప్పుడు ఆమెలో చాలా చేంజెస్ వచ్చాయి. అందరిని నవ్వుతూ పలకరిస్తున్న రష్మిక.. కాస్ట్యూమ్స్ ని కూడా కాన్ఫిడెంట్గా క్యారీ చేస్తుంది. లేటెస్ట్గా హీరామండి ప్రీమియర్స్ లో రష్మిక అటైర్‌ను మెచ్చుకుంటున్నారు నార్త్ ప్రేక్షకులు. ఇటు లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలోనూ అలాగే జరుగుతుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా క్యాస్ట్ విషంలో తనదైన స్టైల్ లో రెచ్చిపోతుంది. ఈవెంట్ ఎక్కడ జరిగిన సెల్ఫ్ సిగ్నేచర్ స్టైల్ లోనే అటెండ్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ.
కెరీర్ స్టార్టింగ్ లో మూవీ ఈవెంట్స్ కి, మిగిలిన ఈవెంట్స్ కి పెద్దగా అటెండ్ కావడానికి ఇష్టపడని ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం అడపాదడపా పేజ్ 3 ప్రోగ్రామ్స్ లో కూడా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే మొదట్లో చాలా కోపంగా ఉండేదట నయన్. సెట్ లోను ఆమె బిహేవియర్ అలాగే ఉండడంతో ఈ అమ్మాయి బిహేవియర్ ఏంటి.. ఇంత రూడ్‌గా ఉంటుంది ఏంటి అని అంత భావించే వారట. కానీ ఇప్పుడు మాత్రం సెట్లో చాలా సాఫ్ట్ అండ్ మెచ్యూర్ గా బిహేవ్ చేస్తుందట నయనతార. సో వీరిద్దరు కెరీర్ ఎదిగిన విధానంలో ఒకరితో ఒకరు పోటీపడి మరీ తమ స్టైల్ లోను, బిహేవియర్‌లోను, ఆలోచనలోనూ చాలా మార్పు చేసుకుంటున్నారు. వీరిద్దరి మార్పును స్పష్టంగా గమనిస్తున్న అబ్జర్వర్స్ ఒకరితో ఒకరు పోటీ పడి మరి ప్రేక్షకులు మెచ్చేలా మారుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.