స్టార్ డాటర్ పై నీహారిక సెన్సేషనల్ కామెంట్స్.. అంత మాట అనేసింది ఏంటి..?

నిహారిక .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు హోస్టుగా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్గా అవతారం ఎత్తింది . పాపం ఆమె నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు . హిట్టు కాకపోగా హ్యూజ్ ట్రోలింగ్ చేశారు . దీంతో ఈ సినిమాలు గినిమాలు మనకు పనికిరావు అంటూ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంది. అయితే ఆమె దురదృష్టం పెళ్లి కూడా కలిసి రాలేదు .

కొన్ని కారణాల చేత జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి చేసుకున్న విడాకులు తీసుకుంది . ఆ తర్వాత నిహారికను మరింత స్థాయిలో ఏకీపారేశారు జనాలు . మెగా ఫ్యామిలీ విడాకులకు కేరాఫ్ అడ్రస్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు . అన్ని ట్రోల్లింగ్స్ ను ఓపికగా భరించిన నిహారిక జనాలకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది . పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరు మీద కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నిర్ణయించుకుంది. అంతేకాదు సినిమాలోకి రీఎంట్రీ కూడా ఇచ్చింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్హకు సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది నిహారిక .

“అర్హ వస పిట్టా అని ..ఎప్పుడూ గలగలా మాట్లాడుతూనే ఉంటుందని.. చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుందని ..అర్హా ఎంత క్యూట్ గా ఉంటుందో తన మాటలకూడా అంతే క్యూట్ గా ఉంటాయి అని.. అందరూ నిహా పిన్ని అని అంటే అర్హ మాత్రమే నిహా అత్త అని పిలుస్తుంది అని ..నా దగ్గరకు వచ్చి ఒళ్లో కూర్చొని ..- నా ఫింగర్ రింగ్స్ నా ఇయర్ రింగ్స్ డ్రెస్ బాగుంది ..ఎక్కడ కొన్నావ్ ..? నన్ను తీసుకెళ్ళవా..? అంటూ ముద్దు ముద్దుగా అడుగుతుందని ..ప్రశ్నలు తానే వేస్తుంది .. ఆన్సర్ కూడా తన ఇస్తుంది ఎక్కడ మనకు మాట్లాడే అవకాశం ఇవ్వదు .. చాలా చాలా టాలెంటెడ్ పిల్ల .. తప్పకుండా మంచి స్థాయికి వెళ్తుంది అందులో డౌటే లేదు ” అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది నిహారిక .

నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే నిహారిక ..అల్లు అర్హ గురించి ఎప్పుడూ కూడా ఏ ఇంటర్వ్యూలోను ఇంత ఓపెన్ గా మాట్లాడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఓపెన్ గా మాట్లాడేసింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమె మాటలను ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు అర్హ అంటే నిహారికకు ఇంత ఇష్టమా..? అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నిహారిక పొగిడేస్తున్నారు..!