“బుద్ధి ఉంటే రాశీఖన్నాతో మరోసారి అలా చేయను”.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!

రాశిఖన్నా ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ. ఇండస్ట్రీలోకి అప్పుడెప్పుడో వచ్చింది . ఇప్పటికి హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది . ఫ్యూచర్లో కూడా సినిమాలు చేస్తాను అంటూ హామీ ఇస్తుంది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతకాలం అవుతున్న సరే రాశిఖన్నా పెద్ద స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది .దానికి కారణం ఆమె చూస్ చేసుకునే సినిమాలే.

మోస్ట్ ఆఫ్ ద టైం సెకండ్ హీరోయిన్ గానే నటించడానికి ఆమె ఓకే చేస్తుంది. అంతేకాదు ఆమె క్యారెక్టర్ పెద్దగా లేకపోయినా అది స్టార్ హీరో సినిమా అయితే ఓకే చేసేస్తుంది అన్న కామెంట్స్ ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి .రాశిఖన్నా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఊహలు గుసగుసలాడే . ఈ సినిమాతో ఆమె మంచి పేరు సంపాదించుకుంది . కాగా తాజాగా టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్ ..రాశీ ఖన్నా పై ఆసక్తికర కమెంట్స్ చేశాడు . అవి కాస్త వైరల్గా మారాయి .

“రాశి ఖన్నా కార్ డ్రైవ్ చేస్తే నేను కూర్చోను.. నాకు దానికి రీజన్ కూడా తెలుసు ..నేను ఆమెతో ఒక సినిమా చేశాను ..ఆ సినిమా టైంలో ఓసారి కార్లో వెళ్ళాను ..అప్పుడే అర్థమైంది ఆమె డ్రైవింగ్ స్కిల్స్ గురించి ..స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా డ్రైవ్ చేస్తుంది ..అమ్మ బాబోయ్ ఇంకొకసారి ఆమె కారులో వెళ్లడం అంటే నా వల్ల కాదు.. ఇంకెప్పుడు కూడా ఆమె డ్రైవ్ చేస్తే కార్ ఎక్కకూడదని ఆ రోజే డిసైడ్ అయిపోయాను ..దారుణాతి దారుణంగా ఆమె కార్ డ్రైవింగ్ ఉంటుంది “అంటూ చెప్పుకొచ్చాడు . అవసరాల శ్రీనివాసరావు అవన్నీ రాశి ఖన్నా పై సరదాగా ఫన్నీగా చేసిన కామెంట్స్ . ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!