ఫైనల్లీ ..పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్ .. అమ్మాయి ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!?

ఫైనల్లీ .. సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీ లోకి చాలామంది సపోర్ట్ తోనే వస్తారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం పెద్ద తలనొప్పి అయిన మ్యాటర్. అప్పుడు ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాలో మనకు తెలిసిందే . అది కూడా ప్లాట్ ఫారమ్ స్టేజి నుంచి సిల్వర్ స్క్రీన్ స్టేజ్ కి రావాలి అంటే చాలా చాలా కష్టపడాలి .. టాలెంట్ ఉండాలి ఎన్నో సిచువేషన్ ఫేస్ చేయాలి అవమానాలను భరించాలి .. ఆ విషయం మనందరికీ తెలిసిందే . అలా అన్ని భరించినా కూడా స్టార్ గా మారుతాము అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వలేము .. అయితే అది సాధ్యమే అంటూ ప్రూవ్ చేశాడు సుడిగాలి సుధీర్ . ప్లాట్ ఫారమ్ స్టేజి నుంచి సిల్వర్ స్క్రీన్ లో మెరిసే స్థాయికి ఎదిగాడు . ఆయన సినీ ఎంట్రీ బుల్లితెర ఎంట్రీ కి సంబంధించిన విషయాలు మనకు తెలిసిందే.

తినడానికి తిండి కూడా లేని ఇబ్బందికరంగా ఉండే సిచువేషన్ నుంచి ఇప్పుడు కోట్లు విలువ చేసే బంగ్లా కార్లలో తిరుగుతున్నాడు అంటే దానికి కారణం ఆయన టాలెంట్ ఆయన కష్టం . జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఆ తర్వాత పలు షో లో హోస్ట్ గా కూడా మెరిశారు. పలు ఈవెంట్స్ కూడా ముందుకు తీసుకెళ్లారు . పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఓ టైర్ 2 హీరోకి ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అంతకుమించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుధీర్ .

మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈయన పెళ్లి వార్త బాగా వైరల్ గా మారింది. యాంకర్ రష్మి .. సుడిగాలి సుధీర్ కాంబినేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. వీళ్ళు ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటారు అని ప్రచారం జరిగింది . అయితే అదంతా కేవలం టిఆర్పి కోసం మాత్రమేనని రియల్ లైఫ్ లో అలాంటి జరగదు అని ఇద్దరు తేల్చేశారు . అయితే సుడిగాలి సుధీర్ ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? ఆయనతోపాటు వర్క్ చేసిన మిగతా కమెడియన్స్ పెళ్లి చేసుకుని పిల్లలతో లైఫ్లో సెటిల్ అయిపోయారు. మరి సుధీర్ పెళ్లి ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ పదేపదే ప్రశ్నించారు .

అలాంటి వాళ్ళకి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు సుధీర్ అంటూ ప్రచారం జరుగుతుంది . సుధీర్ తన సొంత మరదలని పెళ్లి చేసుకోబోతున్నాడట . ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . త్వరలోనే దీనికి సంబంధించి సుధీర్ అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నారట . దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సుధీర్ ఆ గుడ్ న్యూస్ చెప్తాడా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!