మేకప్ రూమ్ లో డ్రెస్ చేసుకుంటుండగా బంధించి అలా చేశాడు.. నిర్మాత పై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్..!!

సినీ, బులితెర‌ పరిశ్రమ రంగం ఇంతగా అభివృధ్ది చెందినా, మీడియాతో అందరూ ఇంటరాక్ట్ అవుతున్నా ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికి కొన్ని దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని బయటకు వస్తున్నా., మరికొన్ని భయాలతో అక్కడికక్కడే సమాధి అయ్యిపోతూఉంటాయి. కాగా వేధింపులుకు తట్టుకోలేని కొందరు సోషల్ మీడియా ద్వారా త‌మ అనుభ‌వాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. అలా తాజాగా తానను మేకప్ రూమ్‌లో బంధించి దారుణంగా వేధించారంటూ ఓ పాపులర్ టీవీ సీరియల్ నటి షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం ఈ న్యూస్‌ టీవీ మీడియాని కుదిపేస్తుంది. ఇంత‌కి ఈమె ఎవ‌రో అస‌లు మ్యాట‌ర్ ఏంటో ఒక‌సారి చూద్దాం.

Actress Krishna Mukherjee crossed all limits of bo*ldness, wrote such a thing on cleavage, people are zooming to read pics - informalnewz

టెలివిజన్ నటి కృష్ణ ముఖర్జీ అంటే టీవి సీరియల్స్ చూసే ప్రతీ ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా యే హై మొహబ్బతీన్ సీరియ‌ల్‌లో ఆమె నటన చూసిన ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. దాదాపు పదేళ్లుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వరస పెట్టి షోలు, సీరియల్స్ చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ఈ అమ్మ‌డుకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగిన్ 3 ,కుచ్ తో హై , నాగిన్ ఏక్ నయా రంగ్ మే, శుభ్ సౌగన్ వంటి సీరియల్స్‌తో కృష్ణ ముఖర్జికి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఓ రకంగా టీవి ఇండస్ట్రీలో ఆమె స్టార్ సెలబ్రెటీ హోదాలో ఉంది.

Krishna Mukherjee Accuses Shehzada Dhami of Harassing Her: 'I Was Changing My Clothes...' | Times Now

అయితే ఆ స్దాయి నటికు కూడా వేధింపులు ఉంటాయంటే నమ్మశ‌క్యం కాదు. కానీ ఆమే స్వయంగా తన ఇన్స్టాగ్రమ్ ఎక్కౌంట్ లో తనను నిర్మాత వేధిస్తున్నాడని వాపోతూ పోస్ట్ షేర్ చేసుకుంది. కృష్ణ ముఖర్జీ తన ఇన్‌స్టా వేదిక‌గా ఏప్రియల్ 26, 2024 న పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో ఆమె దాదాపు ఏడాదిన్నరగా.. ఏ విధంగా ఇబ్బందులు పడుతోంది వివ‌రించింది. ఇంతకాలం ఈ ఇష్యూ మీద మాట్లాడేందుకు ధైర్యం చాలలేదని, తాను సర్దుపోదామనుకున్నా కుదరలేదని వివ‌రించింది. అయితే ఇప్పుడు తాను ఎలాంటి సిట్యువేషన్ అయినా ఎదుర్కోవాలని ఫిక్స్ అయ్యినట్లు చెప్పుకొచ్చింది. శుభ్ షోగన్ నిర్మాత కుందన్ సింగ్ ని ట్యాగ్ చేస్తూ ఆమె ఈ పోస్ట్ షేర్ చేసింది.

Dangal TV's Shubh Shagun to go on air from April 25, the show explores family ties and ...

ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, నిర్మాత తనని బాగా టార్చర్ చేశారని, హెరాస్ చేసారని.. ఆ వేధింపులు చెప్పుకోలేని విధంగా ఉన్నాయని, తట్టుకోలేకే ఇలా ధైర్యంగా సోషల్ మీడియా ద్వారా బయిటపెట్టాల్సి వచ్చిందని వెల్ల‌డించింది. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో శుభ్ షాగున్ నిర్మాత గురించి షాకింగ్ విష‌యాల‌ను వివ‌రించిన ఈ అమ్మ‌డు.. నిర్మాత కారణంగా తాను గత కొన్ని నెలలుగా డిప్రెషన్‌, ఆందోళనకు గుర‌య్యాన‌ని.. షో సెట్స్‌లో తనను వేధించారని.. అనారోగ్యంగా ఉన్నానని, షూటింగ్‌కు రాలేన‌ని చెప్పటంతో తనను మేకప్ గది లోపల లాక్ చేశేసారని.. అంతేకాకుండా ఆ సంస్ద తనకు గత 5 నెలలుగా తన బకాయిలు క్లియర్ చేయలేదని చెప్పుకొచ్చింది. నిర్మాత నుండి బెదిరింపులు వస్తున్నాయని ఆమె మాట్లాడటానికి భయపడిన‌ట్లు వివ‌రించింది. తాను సేఫ్ గా లేనని, అందుకే ఏ షోకు వెళ్లలేకపోతునన్నానంటూ.. ఆ నిర్మాత నుంచి రక్షణ కోరుతున్నట్లుగా ఆమె రాసుకొచ్చింది.