సీత లుక్ లో సాయి పల్లవి..ఎంత క్యూట్ గా ఉందో చూశారా..లీక్డ్ పిక్స్ వైరల్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా రిలీజ్ అవ్వడం కంటే ముందే సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని పిక్స్ .. వీడియోస్.. పాటలు మీడియాలో లీకై వైరల్ అయిపోతున్నాయి. అవి సినీ మేకర్స్ కి భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నాయి . కొంతమంది సినిమాకి హైప్ వస్తుందిలే అంటూ సైలెంట్ అయిపోతుంటే .. కోట్ల బడ్జెట్ పెట్టి ప్రాజెక్టు తెరకెక్కిస్తుంటే.. ఇలా మీడియాలో సినిమా రిలీజ్ కంటే ముందే పిక్స్ లీక్ అయిపోతూ ఉంటే మాకు నష్టాలు వస్తాయి అంటూ బాధ పడిపోతున్నారు సినీ మేకర్స్ .

తాజాగా సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాకి సంబంధించిన షూటింగ్ పిక్స్ వైరల్ గా మారాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో రామాయణం పిక్చర్ ని తెరకెక్కించబోతున్నారు అని చెప్పారే కానీ ఎక్కడా కూడా దాని గురించి అఫీషియల్ గా ప్రకటించలేదు. రన్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే దానిపై ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు .

కానీ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది అని తాజాగా లీక్ అయిన పిక్స్ ఆధారంగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో రామాయణం సినిమాకి సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయి వైరల్ గా మారాయి . అందులో రన్బీర్ కపూర్ – సాయి పల్లవిల పిక్స్ హైలెట్గా మారిపోయాయి . చాలా ట్రెడిషనల్ గా.. చాలా సాంప్రదాయ బద్దంగా చూడగానే ఆకట్టుకునే విధంగా రన్బీర్ కపూర్ సాయి పల్లవి ఉండడంతో జనాలు ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ప్రజెంట్ ఈ పిక్చర్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి..!!