భారీగా రిస్క్ చేస్తున్న రౌడీ హీరో.. వర్కౌట్ అవుతుందంటారా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోనే మంచి పేరు గల వ్యక్తి. ఈయన ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నారు. విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘ ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ పెట్ల దర్శకత్వం మహించాడు.

భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా..అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ తో చేస్తున్న యాక్షన్ మూవీ పై ప్రోకస్ పెట్టాడు విజయ్. ఇందులో విజయ్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించనన్నాడు. అయితే..ప్రజెంట్ ఈ సినిమాపై నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు సినిమా ఏదైనా కానీ అందులో సాంగ్స్ ముఖ్యం. ఒక్కసారి మూవీ హిట్ అవ్వకపోయినా సాంగ్స్ మాత్రం ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాయి. అసలు కొందరు అయితే..పాటల కోసమే సినిమాలు చేస్తారు.

అలాంటిది విజయ్, గౌతమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై కొత్త ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేంటంటె.. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉంటదంట. ఇప్పటివరకు విజయ్ హీరోగా వచ్చిన అన్ని సినిమాల్లో పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమా హిట్ అవ్వకపోయినా సాంగ్స్ కు మాత్రం స్పెషల్ క్రీజే దక్కింది. మరి ఇప్పుడు పాటలు లేకుండా సినిమా తీస్తున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ‘ఇంత రిస్క్ అవసరమా’ అని కొందరు అంటుంటే..’అసలు వర్కాట్ అవుతుందా’ అని మరో కొందరు ప్రశ్నిస్తున్నారు.