ముసుగు ఎత్తేసిన అనుపమ.. ఎట్టకేలకు ఒరిజినల్ బయటపడింది గా..!

టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అ..అ..’ చిత్రంతో తెలుగు తెర‌కి పరిచయమైన బ్యూటీ అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.

‘ శతమానంభవతి’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుని…కుర్రాళ్లకు మరదలుగా మారిపోయింది.ఇక తాజాగా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో బోల్డ్ గా దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేసింది. అయితే..ఇక టిల్లు ముచ్చట కంప్లిట్ కాకముందే..ఈ ముద్దుగుమ్మ మరో చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేటందుకు సిద్ధం అవుతుంది.

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా సినిమా ‘పరదా’ ప్రవీణ్ కండ్రేగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఆనంద వీడియో బ్యానర్ పై విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ చూడని కథతో వస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మొదట అనుపమ ముఖానికి పరదా కప్పుకుని కనిపిస్తుంది. తర్వాత దానిని స్లోగా తొలగిస్తూ టైటిల్ రివిల్ చేశారు. ఇందులో అనుపమ నేచురల్ లుక్స్ లో ఆకట్టుకోవటంతో..ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట విశేషంగా అభిమానిస్తుంది.