బాలయ్య ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్..అఖండ 2 నుంచి నేడే అఫీషియల్ అనౌన్స్మెంట్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయ‌న‌ టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించుకున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తరకెత్తిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అఖండ.

2012 లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం అందుకున్న ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించగా వాటిలో అఘెర పాత్రలో ఆయన నటనకు విశేషమైన ప్రశంసలు దక్కాయి. ఇక ఆ తర్వాత అఖండ సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి ప్రకటించారు. అయితే గత కొన్నాళ్ళుగా ఈ సినిమా గురించి పలు వీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి.

ఇక లేడెస్ట్ టాలీవుడ్ బజ్‌ ప్రకారం ప్రస్తుతం బోయపాటి శ్రీను ఆ సినిమా ఒక్క స్క్రీప్ట్ ని వేగంగా పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10 న ఈ సినిమా ఒక్క అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారికంగా క్లారిటి రావాల్సి ఉంది.