పవన్ కళ్యాణ్ ని లేపేయడానికి ఆ పార్టీ వాళ్లు అలా చేస్తున్నారా..? నాగబాబు సంచలన కామెంట్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అది ఇంట్లో కాదు ఇరుగుపొరుగు అమ్మలక్కలు కాదు ..పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ కాదు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు ఎక్కడ చూసినా సరే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తే జనాలకి మేలు జరుగుతుంది..? అనే విషయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో టిడిపి – జనసేన – బిజెపి అలాగే వైసిపిల మధ్య టఫ్ ఫైట్ నెల్కొంది. ఇప్పటివరకు సర్వేలు కండక్ట్ చేసిన దాని ప్రకారం టిడిపి నే అధికారం చేపట్టబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే ఆఖరి ఓటు బయటపడి అఫీషియల్ డిక్లరేషన్ వచ్చే వరకు ఏది నమ్మలేమంటున్నారు జనాలు . గతంలో చాలా సార్లు ఇలా జరిగాయట. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే కొద్ది పార్టీ నేతల మధ్య మాటల తూటాలులా పేలిపోతున్నాయి . మరీ ముఖ్యంగా తాజాగా జనసేన నేత నాగబాబు తన తమ్ముడి సేఫ్టీ కోసం తన తమ్ముడి పై జరుగుతున్న కుట్రను బయటపెట్టారు .

“జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు కడప నుంచి గుండాలను రౌడీలను తీసుకువస్తున్నారు అని” .. ఆయన ఆరోపించడం ఇప్పుడు ఇండస్ట్రీ ఏపీ రాజకీయాలల్లో పెను సంచలనంగా మారింది. అంతేకాదు ఈ కుట్రవెనక ఒక బడా రాజకీయ నేత కూడా ఉన్నాడు అంటూ ఆయన ఆరోపించారు . వారందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని రాజకీయాల్లో ఓడించేందుకు రాజకీయాల్లో నుంచి పూర్తిగా లేపేయడానికి కుట్ర పన్నుతున్నారు అని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఎవరు ఏం చేసినా .. ఎలాంటి కుట్రలు పన్నినా.. ఎంత మందిని తీసుకొచ్చిన పవన్ ని ఓడించడం అసాధ్యమని తేల్చి చెప్పేశారు. ఇది తెలుసుకున్న జనసేన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఎవ్వరు ఏం చేసినా తాము బెదిరేదే లేదని స్పష్టం చేస్తున్నారు..!!