ఈ హీరోయిన్స్ అందరి మరణం లోను ఇది కామన్..మీరు గమనించారా..!

ఇండస్ట్రీలో కి వచ్చి అతి తక్కువ టైంలోనే స్టార్స్ గా మారిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. మరి ముఖ్యంగా కొంతమందిని మనం అస్సలు మర్చిపోలేము . ఇంకా వాళ్ళు మన మధ్యనే ఉన్నారు అని మనం భ్రమ పడుతూ ఉంటాం . అలాంటి క్రేజీ రేర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ ముగ్గురు హీరోయిన్స్. ఇండస్ట్రీలో వీళ్ళ గురించి ఎప్పుడు జనాలు మాట్లాడుకుంటూ ఉండడానికి మెయిన్ రీజన్ వీళ్ళ నటన .. వీళ్ళ అందం.. వీళ్ళ మంచితనం .. వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .కాగా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముగ్గురు హీరోయిన్స్ మరణం లోను ఒక కామన్ పాయింట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .

దివ్యభారతి: ఇండస్ట్రీని ఏలేస్తున్న టైం లోనే ఆమె సూసైడ్ చేసుకొని మరణించింది . అయితే దివ్యభారతి అప్పటివరకు సంపాదించిన ఆస్తి మొత్తం తన పేరెంట్స్ కి దక్కింది. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పట్లోనే దివ్యభారతి పేరు మీద 70 కోట్ల ఆస్తులు ఉండేవట . ఆస్తి అంతా కూడా తల్లిదండ్రులకే దక్కింది.

సౌందర్య: ఇండస్ట్రీలో మరో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ ..వల్గారిటీ అనే పదానికి దూరంగా .. ట్రెడిషనల్ అనే పదానికి దగ్గరగా ఆమె ఎన్ని సినిమాల్లో నటించి మెప్పించిందో మనకు తెలిసిందే. ఒక విమానయ యాక్సిడెంట్ లో ఆమె మరణించింది . ఆమె మరణించే సమయానికి ఆమె ప్రెగ్నెంట్ కూడా .. అప్పటికే ఆమె పేరు మీద కోట్ల ఆస్తి ఉంది . అదంతా కూడా తల్లిదండ్రులకి రావాలి అంటూ అప్పట్లోనే సౌందర్య ఒక వీలునామ రాసిందట . కానీ అది భర్త తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఆయన పూర్తిగా అనుభవించేసాడట. దీనిపై ఇప్పటికి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

శ్రీదేవి: అతిలోకసుందరి ఇండియన్ లెజెండరీ హీరోయిన్ అనే చెప్పాలి . దుబాయిలో బంధువుల పెళ్ళికి వెళ్లి అనుమానస్పద స్థితిలో మరణించింది . శ్రీదేవి మరణం ఇప్పటికీ ఇండస్ట్రీలో మిస్టరీ . ఈమె చనిపోయే సమయానికి ఈమె పేరు పై కోట్ల ఆస్తి ఉంది . అదంతా కూడా భర్త కూతుర్లకే ఇచ్చేసింది . ఇలా చనిపోయిన కూడా కుటుంబానికి కోట్ల ఆస్తి ఇచ్చి ఆదుకున్నారు ఈ హీరోయిన్స్..!