టీడీపీ – జనసేన మరో అడుగు… ముందుకు పడుతుందా…!?

తెలుగుదేశం, జనసేన మరో అడుగు ముందుకేశాయి. ఈ నెల 9వ తేదీన సమన్వయ కమిటీ భేటీ నిర్వహించి ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన, క్షేత్రస్థాయిలో సమన్వయంపై ప్రధానంగా దృష్టిసారించాలని నిర్ణయించారు. 9న జరగబోయే సమన్వయ కమిటీ భేటీలో వీటిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌లో విశ్రాంతిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేన అధినేత పవన్‌ […]

రెండున్నర గంటల భేటీ… ఏం మాట్లాడుకున్నారో…?

జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మధ్య దాదాపుగా రెండున్నర గంటలపాటు భేటీ జరిగింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా ఆంధ్రాలో భవిష్యత్తు రాజకీయం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి పోరాటాలు వంటి అంశాల పై ఇరుపక్షాలు […]

స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం […]

రంజుగా విశాఖ తూర్పు రాజకీయం…!

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి […]

పవన్ కోసం మెగా ఫ్యామిలీ రెడీ…!

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీ నాయకులను కలుపుకొని బహిరంగ సమావేశాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ ఎంత ద్రోహం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ గడప గడపకు అంటుంటే, టీడీపీ బాదుడే బాదుడు అంటోంది. ఇక జనసేన కూడా వారాహి యాత్ర నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి పేరుతో ఎన్నికల ప్రచారం […]

జనసేన – టీడీపీ నేతలను కలవరపెడుతున్న పొత్తుల వ్యవహారం..!?

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దాదాపు ఏడాదిన్నరగా తేలని పొత్తుల వ్యవహారం… రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరిగిన తొలి ములాఖత్‌లోనే తేలిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో ములాఖత్ భేటీ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ తర్వాత జరిగిన పవన్ నాలుగో విడత వారాహి యాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఇక్కడే అసలు […]

టికెట్ కోసమే ఆయన పాట్లు… అందుకే నోటీ దూల…!

బండారు సత్యనారాయణ మూర్తి… మాజీ మంత్రిగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఈయనకు పేరు. కానీ… అంతకు మించి ఇటీవల ఈయనకు మరింత పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం… మంత్రి రోజాపై అసభ్యకరమైన కామెంట్లు చేయడమే. మంత్రి రోజాను కించపరిచేలా బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్లు చేశాడంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు బండారును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే బండారుపై కఠిన చర్యలు […]

బీజేపీతో పవన్ తెగదెంపులు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని….!

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించిన పవన్ కల్యాణ్… బయటకు వచ్చిన వెంటనే పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలతో తాను మాట్లాడుతా అని కూడా […]

పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ నటుడు, రచయిత , దర్శకుడు ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పై తాజాగా కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అసలు విషయంలోకి వెళితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు కారణంగా ఆ పార్టీ నేతలు రాజమహేంద్రవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు […]