ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ .. నిన్న ఆ ఆరు గంటలు ఏం చేశాడు..? హీట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు రాజకీయ నేతలు తమదైన స్టైల్ లో ప్రచారం చేశారు . నిన్న ప్రశాంతంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది . కాగా రీసెంట్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రధాన పార్టీల అధినేతలు నిన్న ఏం చేశారు అనేది ఆసక్తికరంగా మారింది . మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏం చేశాడు..? అనే విషయం రాజకీయాలలో సంచలనంగా మారింది. మనకు తెలిసిందే.. ఏపీలో అక్కడక్కడ గొడవలు జరిగాయి . హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దాడులు విధ్వంసాలు కూడా జరిగాయి . భారీ ఎత్తున క్యూ లైన్ లో మహిళలు నిలుచొని వృద్ధులు కూడా బారులు తీరి ఓట్లు వేశారు ..

అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం ఆయన ఏపీలో ఎలా ఎన్నికలు జరుగుతున్నాయి ..? ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందా..? లేదా అన్న దానిపై కాన్సన్ట్రేషన్ చేసి పోలింగ్ కేంద్రాలలో లోటుపాట్లను గమనించి వాటి విధివిధానాల గురించి పరిశీలించారు ..నిన్నంతా చంద్రబాబు నాయుడు బిజీబిజీగానే ఉన్నారు . మీడియాలో కూడా కనిపించారు. పొద్దున నుంచి రాత్రి వరకు కూడా ఆయన పార్టీ ఆఫీస్ నుంచి ఇంటికి పోలింగ్ బూత్ కి తిరుగుతూనే ఉన్నారు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉదయం మంగళగిరిలో ఓటు వేసేసి అనంతరం పిఠాపురం నియోజకవర్గం లో ఎన్నికల ప్రక్రియ గురించి పరిశీలించారు .

అయితే ఇప్పుడు సీఎం జగన్ నిన్న ఏం చేశాడు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది . ఉదయం 8 గంటల సమయంలో సొంత జిల్లా కడపలోని భాకారాపురంలో ఓటు వేసేశాడు జగన్ . ఆ తర్వాత మీడియాకు ఎక్కడా కనిపించలేదు . తాడేపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు ..? ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జగన్ ఏం చేశారు ..? అనేది ఇప్పుడు ఏపీలో ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. జగన్ మీడియా కంట కనపడలేదు ..బయట ఎక్కడా కూడా తిరగలేదు ..మరి ఆరు గంటల జగన్ ఏం చేసినట్లు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది .

ఒకవైపు పల్నాడు.. గుంటూరు.. తెనాలి తదితర ప్రాంతాలలో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయో తెలిసిందే. అయినా జగన్ స్పందించలేదు . కనీసం ఓటర్లకు సలహాలు సూచనలు కూడా ఇవ్వలేదు . మరి జగన్ ఏం చేశారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది . అంతేకాదు సజ్జలే మీడియా ముందుకు వచ్చి అడపాదడపా మాట్లాడి మ్యాటర్ ని ఫినిష్ చేశారు. మరి ఆరు గంటలు సీఎం జగన్ ఏం చేశారు ..?మరి ఆరు గంటలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం జగన్ ఏం చేశారు..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది..!!