Phone Pe, Google Pay, Paytm ఎక్కువుగా వాడుతున్నారా.. భారీ బొక్క తప్పదు..వెలుగు చూసిన షాకింగ్ నిజాలు..!!

ప్రజెంట్ టెక్నాలజీ ఎంతలా మారిపోయిందో మనకు తెలిసిందే. ఏది కావాలన్నా సరే మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే సెకండ్స్ లో మన చేతిలోకి వచ్చి పడిపోతాయి . అది ఏదైనా సరే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ కి ఎక్కువగా అలవాటు పడిపోయారు జనాలు . పెద్ద పెద్ద ఐటమ్స్ కే కాదు చిన్న అగ్గిపెట్టి కొన్న ..పాల ప్యాకెట్ కొన్న .. ఆఖరికి పది రూపాయల పానీ పూరి తిన్న కూడా డిజిటల్ పద్ధతిలోనే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు . ఫోన్ పే ..గూగుల్ పే .. పేటియం యాప్స్ రావడంతో మరింతగా వాటికి అలవాటు పడిపోయారు. స్మార్ట్ ఫోన్ తీసామా.. స్కాన్ చేసామా.. అన్న విధంగా అలవాటు పడిపోయారు జనాలు .

అంతేకానీ ఎక్కడా కూడా డబ్బును క్యారీ చేస్తున్న వాళ్లు చాలా తక్కువ మంది గా కనిపిస్తున్నారు . అయితే ఇది చాలా చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు . ఇది నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నారు . డిజిటల్ చెల్లింపు అందుబాటులోకి రావడం వల్ల డబ్బులు జనాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట. ఒకప్పుడు షాపింగ్ కి వెళ్లేటప్పుడు ఎంత కావాలో అంత డబ్బులు మాత్రమే పెట్టుకొని వెళ్లేవారట. ఎప్పుడైతే ఈ యూపీఐ ఆప్స్ అందుబాటులోకి వచ్చాక జనాలు కంట్రోల్ లో లేకుండా ఉండిపోయారట . ఇంద్ర ప్రస్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ అనే సంస్థ భారత దేశంలో యూపీఐ చెల్లింపులపై చేసిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి .

యుపిఐ పేమెంట్స్ పెరగడంతో మనుషులు జనాభా కంట్రోలింగ్ పద్ధతిని మర్చిపోయారట. మనసుకు నచ్చినవి కొనేస్తూ.. స్కాన్ చేసేసి డబ్బులు వదిలించేసుకుంటున్నారు. తీరా నెలాఖరులో డబ్బులు అయిపోయింది అని బాధపడిపోతున్నారు. దాని వల్ల ప్రజలు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అంతేకాదు తాజా అధ్యయనం ప్రకారం యూపీఐ ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించడం వల్ల భారతదేశంలో 75% మంది ప్రజలు ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తున్నారట. సర్వే ప్రకారం 81 శాతం మంది వ్యక్తులు రోజువారిగా యూపీఐ ఆప్స్ వాడుతున్నారట . ఇదే క్రమంలో జనాలు యూపీఐ ఆప్ ద్వారా సగటు రోజుకి 200 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది . ఏప్రిల్ మాసంలో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 1330 కోట్లకు చేరుకుందట . ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . యూపీఐ ఆప్స్ వాడడం వల్ల జేబుకి చిల్లు పడుతున్నాయి అని నివేదిక వెల్లడించింది..!!