అర్ధం కానీ అయోమయ పరిస్ధితిలో ఆ మెగా హీరో.. ఇలా ఇరుక్కునేశాడు ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తే సరిపోదు.. దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా.. అని పలుకుబడి ఉంది కదా అని.. ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తే ..ఆ ఫ్యాన్సే హిట్ చేసేస్తారు.. స్టార్ గా మార్చేస్తారు అనుకోవడం పొరపాటే .. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల విషయాలలో జనాలు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు . అయితే ఆ లిస్టులోకే వస్తాడు మెగా హీరో . పంజా వైష్ణవ్ తేజ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వైష్ణవ్ తేజ్ ఇప్పటివరకు హిట్ కొట్టింది ఒకే ఒక్క సినిమా . అది కూడా ఉప్పెన . ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం హీరోయిన్ కృతి శెట్టి . అదేవిధంగా డైరెక్టర్ బుచ్చిబాబు సనా అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . వైష్ణవ్ తేజ్ నటన పెర్ఫార్మన్స్ శూన్యం అంటూ ట్రోలింగ్ కూడా జరిగింది . ఆ తర్వాత పలు సినిమాలో నటించిన కూడా ఈ మెగా హీరోహిట్స్ అందుకోలేకపోయాడు. కనీసం యావరేజ్ హిట్ కూడా అందుకోలేకపోయాడు . శ్రీలీలతో కూడా ఆదికేశవ అనే సినిమాలో నటించాడు.

అయినా సరే సినిమా డిజాస్టర్ గా మారింది . దీంతో ఈ మెగా హీరో పరిస్థితి అయోమయ స్థితిలో పడిపోయింది . అలా అని ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోలేడు .. పెద్ద పలుకుబడి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో ఫ్యామిలీనీ నుంచి వచ్చారు.. అలా అని డైరెక్టర్స్ ని అవకాశము ఇవ్వండి అని అడగలేడు.. అహం అడ్డు వస్తుంది .. ఒకవేళ అడిగిన డైరెక్టర్స్ అవకాశాలు ఇచ్చే పొజిషన్లో లేరు . ఇప్పుడు ఏం చేయాలి..? ఎలా పరిస్థితులు ముందుకు తీసుకెళ్లాలి..? అనే అయోమయ పరిస్థితిలో ఉండిపోయాడట ఈ హీరో. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి పంజా వైష్ణవ తేజ్ ఎలా తన కెరీయర్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో..???