వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండా.. ఆ స్టార్‌ హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో హిట్ కొట్ట‌గ‌ల‌డా..?!

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. రౌడీ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్.. తను నటించిన అన్ని సినిమాలతో సక్సెస్ అందుకోలేకపోయాడు. తాను ఎంచుకునే కథలలో వైవిధ్యత లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. దీంతో ఆయన ఫ్లాప్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ కొట్టాలని.. దృఢ సంకల్పంతో దూసుకుపోతున్న విజయ్.

Vijay Devarakonda : రామ్ చరణ్ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసిన విజయ్  దేవరకొండ.. ఈ రౌడీ హీరో మామూలోడు కాదంటూ

ఇటీవ‌ల గౌతం తినన్నూరి డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇది రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథ అని తెలుస్తుంది. ఇప్పుడు రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కథను కూడా మొదట బాలయ్య రిజెక్ట్ చేశాడని.. దీంతో విజయ్ దేవరకొండ దగ్గరకు అవకాశం వెళ్ళిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇక స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలతో విజయ్ దేవరకొండ తెర‌కెక్కిస్తున్న సినిమాలు ఆయనకు ఎంతవరకు సక్సెస్ తెచ్చి పెడతాయో వేచి చూడాల్సిందే. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

Balakrishna - Vijay Devarakonda : విజయ్ దేవరకొండ బాల నటుడనే విషయాన్ని  అన్‌స్టాపబుల్‌లో బయట పెట్టిన బాలయ్య..

అది కూడా మంచి కాన్సెప్ట్లతో తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇక స్క్రిప్ట్ డివిజన్లో తేడాలు రాకూడదనే ఉద్దేశంతోనే ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడట రౌడీ హీరో. కాగా రాబోయే రోజుల్లో దేవరకొండ నటించే సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు వేచి చూడాలి. ఇప్పటికే స్టార్ హీరోగా మారాల్సిన విజయ్ దేవరకొండ.. స్క్రిప్ట్ సెలక్షన్లు చేసిన తప్పుల కారణంగా స్టార్ హీరోగా ఎదగలేక పోయాడ అనడంలో అతిశయోక్తి లేదు.