‘ పుష్ప 2 ‘ సాంగ్ రికార్డ్స్ బ్రేక్ చేసేలా ‘ దేవర ‘ ఫస్ట్ సింగిల్.. ఎలా ప్లాన్ చేశారంటే..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వ‌చ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మ‌రోసారి వీరిద్దరి కాంబోలో దేవర సినిమా తెరకెక్కుతుంది. భారీ క్యాస్టింగ్ తో దేవార రూపొందుతుండగా.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప 2 సింగిల్ మించేలా.. దేవర ఫస్ట్ సింగెల్‌ ఉండబోతుందని.. ఈ సినిమా కోసం అనిరుధ్‌ అదిరిపోయే లెవెల్‌లో ట్యూన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అనిరుధ్‌ తమిళ్లో సక్సెస్ అయిన స్థాయిలో.. తెలుగులో క్రేజ్ సంపాదించుకోలేదన సంగతి తెలిసిందే.

Pushpa Pushpa: First single from Pushpa 2 The Rule is a celebration of Allu  Arjun's role. Watch - Hindustan Times

అయితే దేవర సినిమాతో తెలుగులోను అదే రేంజ్ లో సక్సెస్ అందుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనిరుధ్‌ ఈ సినిమాతో టాలీవుడ్ లోను అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోవాలని మరింత కసితో పని చేస్తున్నారట. దేవర సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ ఫ్యాన్స్ కు రెట్టింపు సంతోషాన్ని అందించడం ఖాయం అంటూ తెలుస్తోంది. మే 20న‌ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. అభిమానులకు ఫస్ట్ సింగల్ తో సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశారట మేకర్స్. ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒక్కరోజు ముందే దేవ‌ర‌ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ తెలుస్తోంది.

Anirudh and Koratala @ NTR's house @ 2 AM - TeluguBulletin.com

తారక్ పుట్టినరోజున వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు స‌మాచారం. దేవర రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా.. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు.. ఎంటర్టైన్మెంట్ కు మంచి ప్రాధాన్యత ఉందట. తారక్‌, జాన్వి కపూర్ కాంబో సిన్స్ సరికొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. దీంతో పాట్టే తారక్ పుట్టినరోజున వార్ 2 సినిమాకు సంబంధించిన అప్డేట్. అలాగే ప్రశాంత్ నాల్ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ రానున్నాయని టాక్.