రజినీకాంత్ ‘ కూలీ ‘ క్లైమాక్స్ బడ్జెట్ ఎన్ని కోట్లు తెలిస్తే కళ్ళు జిగేల్మంటాయి ..?!

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బస్ కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన రజిని.. అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఏర్పరచుకున్న రజిని.. ఏడుపదుల వయసులోనూ ఎక్కడా ఎవరికీ తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ తన స్టైల్, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

Rajinikanth's 171st film titled Coolie, Lokesh Kanagaraj unveils teaser -  India Today

తను నటించిన సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి త‌న స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీ, లోకేష్ క‌నగ‌రాజ్ డైరెక్షన్లో కూలి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యాక్ష‌న్‌ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు మేకర్స్. ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో రజనీకాంత్, లోకేష్ ఇద్ద‌రు శ్రమిస్తున్నారు. విక్రమ్ సినిమా తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కిన లియో సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నాడు లోకేష్ కనగ‌రాజ్.

How Rajinikanth and Lokesh Kanagarajs Union Will Go Big With Coolie That  You Cant Miss to Watch

దీంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉండబోతుందని.. ఏకంగా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చుపెట్టి మరి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలోను ఫైట్ సీన్స్ చూపించని విధంగా వైవిధ్యమైన ఫైట్ ను తెరకెక్కించి సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడ‌ట లోకేష్‌.