2 గంటల ప్రయాణం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడు గెస్ చేయలేదు.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

ముంబైలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన ‘ ముంబై ట్రాన్స్ఫర్ లింక్ ‘.. పై తాజాగా నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన స్పందించింది. ఆమె ఇటీవలే ఆ వంతెన పై ప్రయాణించానని.. ఆ ప్రయాణంలో తన అనుభూతిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. రెండు గంటల్లో ప్రయాణం కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు అంటూ.. ఇలాంటిది సాధ్యమవుతుందని అసలు ఎవరు అనుకొని ఉండరు అంటూ వివ‌రించింది. ఇప్పుడు మనం ముంబై నుంచి నవీముంబైకి సులువుగా జర్నీ చేయొచ్చంటూ రాసుకొచ్చింది. ఇటీవలే ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది.. ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు.. అంటూ కామెంట్స్ చేసింది.

Mumbai Trans Harbour Link motorists' commute to get smoother

యువభారత్ దేన్నైనా సాధిస్తుంది. గత పది ఏళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. దేశంలో మౌలిక వసతులు, రహదారుల ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయి అంటూ ఆమె వివరించింది. అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలను కోరుకుంది. ముంబై నగరంలో నిర్మించిన ఈ ముంబై ట్రాన్స్ఫర్ లింక్ వంతెనను జనవరిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అతి పొడవైన వంతెన ముంబై సేవరి.. నుంచి రాయగడ మహా సేన‌ను కలుపుతూ రూ.21,200 కోట్ల బడ్జెట్ తో ఆరు లైన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ఇక ఇందులో అటల్ సేతు మొత్తం 21.8 కిలోమీటర్లు గా నిర్మించబడింది.

Rashmika Mandanna set to share screen space with Salman Khan - Life & Style  Aaj English TV

దీనిలో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రం పై నిర్మించడం విశేషం. ఇక రష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతుంది. అల్లు అర్జున్, సుకుమార్‌ డైరెక్షన్లో వస్తున్న పుష్ప 2లో శ్రీవల్లిగా ప్రేక్షకులను మెప్పించనుంది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ధనుష్, నాగార్జున కాంబోలో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వ‌స్తున్న కుభేరా లోను, సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ సినిమాలోను ఈ ముద్దుగుమ్మ న‌టిస్తుంది అలాగే రెయిన్‌బో, ది గర్ల్ ఫ్రెండ్, చావ్లా సినిమాలతో బిజీగా గ‌డుతుంది.