మహేష్, పవన్ లో ఉన్న కామన్ పాయింట్ మీరు గమనించారా.. అది ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వీరిద్దరికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఓకే టైం లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలు ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య చాలా కామన్ పోలికలు ఉన్నాయి అంటూ తాజాగా మహేష్ సోదరి మంజుల చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ హెల్ది కాంపిటీషన్ ఉన్న ఇద్దరు మంచి హీరోలు అంటూ అమ్మే వివరించింది.

Fans didn't want me to act': Mahesh Babu's Sister Manjula on her depressed  acting career | Telugu Movie News - Times of India

తమ మనస్సు చెప్పిందే వాళ్ళిద్దరూ ఫాలో అవుతారని మంజుల వివరించింది. అటు పవన్, ఇటు మహేష్ ఇద్దరు వాళ్లకి నచ్చిందే చేస్తారని.. వాళ్లకు నచ్చిన లోకంలోనే ఉంటారంటూ చెప్పుకొచ్చింది. వీరిద్దరి మధ్య ఇంకా ఎన్నో పోలికలు కామన్ గా అనిపిస్తూ ఉంటాయంటూ వివరించింది. మంజుల ప్రస్తుతం పవన్, మహేష్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవడంతో.. అటు పవన్ ఫ్యాన్స్ తో పాటు, ఇటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం త‌న లుక్ మార్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు.

Pawan Kalyan: Biography, Movies, Lifestyle, Family, Awards & Achievements

పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా పవన్, మహేష్ వారి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రోజురోజుకు అభిమానుల సంఖ్యను మరింతగా పెంచుకోవడం విశేషం. మహేష్, రాజమౌళి కాంబో ఏకంగా రూ.1000కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఒకింత‌ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. కాగా మహేష్, పవన్ కళ్యాణ్ కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంత ఎప్పటినుంచో త‌మ‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఫ్యూచర్లో అయినా ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమాలో నటిస్తారేమో వేచి చూడాలి.