పిల్లల్ని కన్నవారికి బాధ్యత తెలియదా.. పెంపుడు కుక్క ఘటనపై యాంకర్ రష్మీ షాకింగ్ రియాక్షన్..?!

బుల్లితెర బోల్డ్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్ప‌టిక‌పుడు ఏదో ఒక విషయంలో స్పందిస్తూ నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమె జంతు ప్రియురాలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. జంతువుల పట్ల దారుణంగా వ్యవహరించడం, హింసించడంపై ఎన్నోసార్లు సీరియస్ గా రియాక్ట్ అయిన ఈ అమ్మడు.. నిందితులను శిక్షించాలంటూ పోస్ట్‌లు పెట్టడంతో పాటు.. జంతు ప్రేమికురాలిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Jabardasth Anchor Rashmi Feeding Street Dogs | Rashmi Love Towards Dogs |  Manastars

రీసెంట్ గా తన జంతు ప్రేమను మరోసారి చాటుకుంది రష్మీ. ఇటీవల వికారాబాద్ జిల్లా తాండూర్ లో ఓ ఐదు నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ చిన్నారి చనిపోయింది. దీంతో ఆ చిన్నారి పేరెంట్స్ దాడి చేసిన కుక్కను వెంటనే అక్కడికక్కడ కొట్టి చంపేశారు. కాగా ఇదే ఘటనపై ఓ నెటిజ‌న్ స్పందిస్తూ కుక్క‌ను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి గౌతమ్ అంటుంది అంటూ ఎక్స్ వేదికపై ట్విట్ చేశారు. రష్మి దానిపై రియాక్ట్ అవుతూ.. తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. పిల్లలను కన్నవారికి బాధ్యత ఉండదా..? పేరెంట్స్ ఆ చిన్నారిని పట్టించుకోకుండా ఎందుకు వదిలేసారు..? అంటూ ప్ర‌శ్నించింది.

Rashmi Gautam shares all about her days of struggle in the entertainment  industry with Ali on 'Ali to Saradaaga' - Times of India

కుక్క దాడి చేస్తున్న టైంలో వాళ్లు ఏం చేస్తున్నారు..? నిద్రపోతున్నారా..? పిల్లలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వారికి లేదా..? జంతువులపై చెత్త ప్రచారం ఆపండి అంటూ ఫైర్ అయింది. పిల్లల జీవితాలను రిస్క్ లో పెట్టింది ఎవరు..? అదే జంతువుల విషయానికి వస్తే లాజిక్స్ అన్నీ మర్చిపోయి మాట్లాడతారు. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను ఎలా పడితే అలా వదిలేయకండి అంటూ వివరించింది. అంతేకాదు బయట వ్యక్తులపై తమ‌ పెంపుడు జంతువులు దాడి చేయకుండా యజమానులే ట్రైనింగ్ ఇవ్వాలి ఆ భాద్య‌త మీదే వివరించింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవడంతో కొందరు ఆమె చెప్పింది కరెక్ట్ అంటూ మరికొందరు తమదైన రీతిలో రిప్లై ఇస్తున్నారు.