విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబో లో మూవీ.. అప్పుడు మిస్సయిన ఇప్పుడు ఫిక్స్..?!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా తరువాత ఆయనకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఖుషి మూవీ యావరేజ్ గా మిగిలింది. ఇటీవల విజ‌య్ నుంచి వ‌చ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అదే టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రమంలో విజయ్ ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఆయన గట్టిగా శ్రమిస్తున్నాడట. ఎప్పుడు ఒకే రకమైన కథలను ఎంచుకునే రౌడీ హీరో.. ఇప్పుడు హిట్ కోసం కొద్దిగా రూట్ మార్చి వైవిధ్యమైన కథ ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. గౌతం తినన్నురి డైరెక్షన్‌లో ఓ సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Vijay Deverakonda To Team Up With Dil Raju Again, Ravi Kiran Kola's Film Poster Out On Actor's 35th Birthday

ఈ మూవీ వైవిధ్య‌మైన కాన్సెప్ట్‌తో రానుంద‌ని సమాచారం. ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ గా తెరకెక్కనుందని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో పక్క దిల్ రాజు బ్యానర్ లో ఇంకో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ సిద్ధమయ్యాడు. రాజావారు రాణిగారు తో డిసెంట్‌ సక్సెస్ అందుకున్న రవికిరణ్ కోలా.. డైరెక్షన్లో ఓ రూరల్ యాక్షన్ డ్రామాలో నటించనున్నాడు విజయ్. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడింది.

Sai Pallavi - Wikipedia

ఇందులో హీరోయిన్గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకునే ప్లాన్‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో డియర్ కామ్రేడ్ మూవీలో సాయి పల్లవిని విజయ్ జోడిగా అడగగా.. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయని చెప్పడంతో.. సాయి పల్లవి ఆ స్టోరీని రిజెక్ట్ చేసింది. త‌ర్వాత ర‌ష్మిక‌కు ఆ ప్రాజెక్ట్ వెళ్ళింది. అయితే అప్పుడు మిస్ అయినా ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యేలా ఉందంటూ సమాచారం. దిల్ రాజు.. సాయి పల్లవి డేట్స్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడట. ఇక గతంలో దిల్ రాజు ప్రొడక్షన్లో వ‌చ్చిన‌ ఫిదా, ఎంసీఏ సినిమాల్లో సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ప్రస్తుతం మరోసారి దిల్ రాజు.. సాయి పల్లవి తో సినిమాలు తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు.